సోషల్ మీడియాలో తెలుగు హీరోలు ఈమద్య కాలంలో తెగ దున్నేస్తున్నారు.ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్ని చోట్ల కూడా దుమ్ము దులిపే విధంగా ఫాలోవర్స్‌ను దక్కించుకుంటున్నారు.
ముఖ్యంగా సెలబ్రెటీలు ఎక్కువగా ఉండే ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్టర్‌లో భారీ ఎత్తున ఫాలోవర్స్ వస్తున్నారు.ఇటీవలే సీనియర్ హీరో నాగార్జున ట్విట్టర్‌లో ఆరు మిలియన్‌ల ఫాలోవర్స్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే.ఆయన వెంటనే రానా కూడా అదే క్లబ్‌లో చేరాడు.
రానా హీరోగా ఎంత యాక్టివ్‌గా ఉంటాడో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటాడు.
కేవలం తెలుగులోనే కాకుండా రానాకు తమిళం మరియు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అందుకే ఆయనకు ఈ స్థాయిలో ఫాలోవర్స్ అంటూ టాక్ వినిపిస్తుంది.రానా ఆరు మిలియన్‌ల ఫాలోవర్స్‌ను దక్కించుకున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ సెలబ్రెషన్ చేసుకుంటున్నారు.
![Telugu Nagarjuna, Rana Daggubati, Followers- Telugu Nagarjuna, Rana Daggubati, Followers-](https://telugustop.com/wp-content/uploads/2020/06/Rana-nag-twitter.jpg)
రానా ఇటీవలే తన ప్రేయసి మిహిక బజాజ్‌తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెల్సిందే.డిసెంబర్‌కు ముందే వీరి పెళ్లి ఉంటుంది.మరో వైపు రానా విరాట పర్యం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు.
అలాగే రానా అరణ్య చిత్రం కూడా విడుదలకు రెడీ అయ్యింది.ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.