నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమాతో తెలుగులో ఎవరికీ సొంతం కాని గుర్తింపు దక్కించుకుంది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మరల సావిత్రిని గుర్తుచేసింది అంటూ కీర్తి సురేష్ ని ఆకాశానికి ఎత్తేశారు.
ఇక ఆమె ఇమేజ్ కూడా మహానటి సినిమాతో అమాంతం పెరిగిపోయింది.ఓ విధంగా చెప్పాలంటే మహానటి తర్వాత కీర్తి సురేష్ ని మరో సావిత్రి రేంజ్ లో తెలుగు ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు.
అందుకే ప్రేక్షకుల అంచనాలని అందుకోవాలంటే సెలక్టివ్ గా సినిమాలు చేయాలని భావించి చిన్న సినిమాల జోలికి ఈ అమ్మడు వెళ్ళలేదు.
రెండేళ్ళ గ్యాప్ తర్వాత ప్రస్తుతం వరుసగా తెలుగులో మూడు సినిమాలు లైన్ లో పెట్టింది.
అయితే కీర్తి సురేష్ ని హీరోయిన్ గా పెట్టుకోవాలని చాలా మంది దర్శక, నిర్మాతలు తెలుగులో సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే మహానటి క్రేజ్ తో తెలుగులో ఈమె రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేసిందని, నిర్మాతలు ఎవరు వచ్చిన తాను డిమాండ్ చేసిన మొత్తం ఇస్తేనే చేస్తానని స్పష్టంగా చెప్పెస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
ఈ నేపధ్యంలో చిన్న నిర్మాతలు అయితే పూర్తిగా కీర్తి సురేష్ ని కలవడం మానేసారని చెప్పుకుంటున్నారు.ఇక పెద్ద నిర్మాతలు మాత్రమే కీర్తి డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారనే మాట బలంగా వినిపిస్తుంది.
అయితే కొంత మంది నిర్మాతలకి డేట్స్ ఇవ్వకపోవడంతో వారే ఇలాంటి ప్రచారం తెరపైకి తీసుకోచ్చారనే మరో వాదన కూడా వినిపిస్తుంది.