ఆయుధాల చట్టంలో సవరణలు,ఇకపై రెండు ఆయుధాలకు మాత్రమే

దేశంలో అనేక అంశాల్లో మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా దేశంలో ఆయుధాల వాడకం పెరుగుతుండటంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయుధాల చట్టంలో సవరణలు చేసినట్లు తెలుస్తుంది.

 Central Government, Ips Officer, Anjani Kumar, Police Department, Arrest, Guns,-TeluguStop.com

కొత్తగా చేసిన సవరణల ప్రకారం ఇకపై వ్యక్తిగత రక్షణ కోసం రెండు ఆయుధాలనే అనుమతిస్తామని ఐపీఎస్ ఆఫీసర్ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.ఈ తాజా నిబంధనల ప్రకారం ఎవరిదగ్గరైనా రెండు కంటే ఎక్కువ ఆయుధాలు ఉంటే మాత్రం వాటిని తిరిగి అప్పగించాలి అని,లేదంటే వాటిని అమ్ముకోవడానికి ఏడాది పాటు టైమ్ ఉంటుంది అని ఆయన వివరించారు.
దేశంలో ప్రధానంగా కొంతమంది రాజకీయ నాయకులు, వీఐపీలు, వ్యాపారవేత్తలు తమ రక్షణార్ధం లైసెన్స్డ్ వెపన్స్ ను అందుబాటులో ఉంచుకుంటున్నారు.ఐతే… దేశంలో రక్షణ వ్యవస్థలు బలపడడం, పైగా ఇదివరకట్లాగా ఉగ్రవాద, దోపిడీ చర్యలు చాలా వరకూ తగ్గుముఖం పట్టడం తో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దేశంలో అన్ని వ్యవస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడం తో వ్యక్తుల దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉన్న గన్స్, రివాల్వర్ల వంటి వి ఉండటం కరెక్టు కాదని కేంద్రం భావించి ఆయుధాల చట్టంలో సవరణలు చేసినట్లు తెలిసింది.

ఇప్పుడు రెండుకంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నవారు రెండు మాత్రమే ఉంచుకొని, మిగిలిన వాటిని ఏం చెయ్యాలి అనేది పోలీస్ శాఖను సంప్రదించాల్సి ఉంటుందట.

ఒకవేళ ఏముందిలే అని తమ వద్దే ఉంచుకుంటే మాత్రం ఆయుధాల చట్టం క్రింద అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube