స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఇప్పటికే ఈ సినిమా పలు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ తన సత్తా చాటుతోంది.కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా రికార్డును అల వైకుంఠపురములో అలవోకగా దాటేసింది.
ముఖ్యంగా కెనెడా మరియు యూఎస్‌లో అల వైకుంఠపురములో అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది.తాజాగా యూఎస్‌లో ఈ చిత్రం $3.54 మిలియన్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.గతంలో రంగస్థలం చిత్రం టోటల్ రన్‌లో వసూలు చేసిన $3.53 మిలియన్ల మార్కును ఈ సినిమా అధిగమించింది.దీంతో ఈ సినిమా ప్రస్తుతం బాహుబలి 2 తరువాత స్థానంలో నిలబడింది.ఈ సినిమా టోటల్ రన్‌లో $3.7 మిలియన్ వరకు కలెక్ట్ చేస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది.
త్రివిక్రమ్ మార్క్ టేకింగ్‌కు బన్నీ స్టైలిష్ యాక్టింగ్ తోడుకావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది.ఇక థమన్ సంగీతం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇప్పటికే రూ.150 కోట్ల షేర్ వసూళ్లు సాధించి పాత రికార్డులను పాతర వేసింది.ఈ సినిమా టోటల్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.