సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా రివ్యూలు ఇంకా రాలేదు కానీ, ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా ముందే రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ప్రీమియర్ల ద్వారా సినిమాను అక్కడి జనం మనకంటే ముందుగానే చూశారు.
ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్‌లో అసలే మహేష్ క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ క్రేజ్‌కు తగ్గట్టుగా సినిమా వచ్చిందని, మహేష్ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ థ్రిల్ కావడం పక్కా అని తెలుస్తోంతి.
ఇక ఓవర్సీస్ ప్రీమియర్లతో సరిలేరు నీకెవ్వరు మిలియన్ మార్క్‌ను టచ్ చేయడం గ్యారెంటీ అనుకున్నారు.కానీ కొంత తక్కువ మొత్తంతో ఈ చిత్రం ప్రీమియర్లతో ఏకంగా 700కె డాల్లర్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేవలం 252 లోకేషన్ల నుండే ఈ సినిమా 547కె డాలర్లు కొల్లగొట్టినట్లు వారు తెలిపారు.
యూఎస్ ప్రీమియర్ చిత్రాల టాప్ టెన్ జాబితాలో సరిలేరు నీకెవ్వరు ఖచ్చితంగా చోటు దక్కించుకుంటుందని తెలుస్తోంది.అటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజు ఏకంగా రూ.32 కోట్లు కలెక్ట్ చేస్తుందని చిత్ర యూనిట్ లెక్కలు వేస్తుంది.సినిమా రిలీజ్ అవుతున్న అన్ని థియేటర్లలో హౌజ్‌ఫుల్ బుకింగ్స్ అయినైట్లు తెలుస్తోంది.మొత్తానికి మహేష్ మేనయాతో సంక్రాంతి పండగ ముందే వచ్చేసిందా అనేలా సందడి నెలకొంది.ఈ సినిమా ఇంకా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.