తెలంగాణ ప్రభుత్వానికి ఇద్దరు సీఎం లు ఉన్నారంటూ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ ఇద్దరిలో ఒకరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాగా, మరొకరు ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంటూ అరవింద్ విమర్శలు చేశారు.
ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజంగానే భావన సామాన్య ప్రజల్లో సైతం కలుగుతోందని అరవింద్ అన్నారు.తెలంగాణ సీఎం ఓవైసీనేనని, కేసీఆర్ అనధికారిక సీఎం అంటూ ఎద్దేవా చేశారు.
ప్రగతి భవన్‌లో ఈ ఇద్దరి సీఎం లకు ఒకే రకమైన కుర్చీలా అంటూ ఎద్దేవా చేశారు.అయితే పార్లమెంట్‌లో టీఆర్ఎస్ పార్టీ అసలు నిజస్వరూపం బయటపడిందని, తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ మోసాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారంటూ ఆయన చెప్పారు.
ఇప్పటికీ ఎంఐఏం ఆధీనంలోనే టీఆర్ఎస్ ఉందంటూ ఆయన విమర్శలు చేశారు.అసదుద్దీన్ ఎలా చెబితే అలా ఇప్పటికీ కేసీఆర్ నడుచుకుంటాడని అరవింద్ ఎద్దేవా చేశారు.