ఒక పాత సినిమాలో ఇది చాలా పాపులర్ డైలాగ్ .పోలీస్ క్యారెక్టర్ వేసిన నూతన ప్రసాద్( Actor Nuthan Prasad ) ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఈ డైలాగ్ వాడుతూ ఉంటారు.
ఇప్పుడు ఈ డైలాగ్ తెలుగుదేశం ఎదుర్కుంటున్న ప్రస్తుత పరిస్థితికి అచ్చంగా సరిపోతుందని చెప్పవచ్చు.ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) మొదలుకొని జరుగుతున్న ప్రతి పరిణామం ఆ పార్టీకి వ్యతిరేకంగానే కనిపిస్తుంది.
ఒకదాని తర్వాత ఒకటి కేసుల చట్రంలో బిగించే విధంగా అధికార వైకాపా ముందుకు వెళ్లడం ఒకవైపు అయితే.బెయిల్ కోసం లేదా కనీసం హౌస్ అరెస్ట్ కోసం కానీ లేదా ఇతర కేసుల విషయం లో ముందస్తు బెయిల్ కోసం గాని తెలుగుదేశం లీగల్ టీం చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడికక్కడ విఫలం అవ్వడం తెలుగు తమ్ముళ్లను ఆందోళన పరుస్తుంది.
దేశం లోనే అత్యంత ఖరీదైన లాయర్ అయిన సిద్దార్ధ్ లుధ్రా( Lawyer Sidharth Luthra ) కూడా చంద్రబాబుకు రిలీఫ్ ఇవ్వలేకపోతున్నారు.తెలంగాణ హైకోర్టు( Telangana High Court )లో అత్యవసరంగా వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.రాజ్యాంగ హక్కులకు భంగం కలుగుతుందని అత్యవసరంగా వినాలన్న లుధ్రా వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు .కౌంటర్ దాఖలు చేయకుండా వాదనలు ఎలా వింటామని మీకు అవసరమనుకుంటే బెంచ్ మార్చుకోవచ్చు అంటూ కూడా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.దాంతో లుధ్రా అవసరం లేదంటూ బదులిచ్చారు.
మరోవైపు ట్విట్టర్లో చంద్రబాబు లాయర్ లుధ్రా చేసిన ట్వీట్ ద్వారా కూడా తెలుగుదేశం పరిస్థితి( TDP ) అంత ఆశాజనకంగా లేదన్న వాతావరణం కనిపిస్తుంది.అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపుమేరలో కనిపించకపోతే ఇక కత్తి పట్టుకుని యుద్ధం చేయడమే పోరాటానికి సరైన విధానం అంటూ గురు గోవింద్ సింగ్ సూక్తులను ట్విట్ చేసిన ఆయన తెలుగు తమ్ముళ్లకు కొత్త అనుమానాలను రేకెత్తించినట్లుగా తెలుస్తుంది అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం వాటికి పైఎత్తులు వేస్తుందని, ఇప్పట్లో చంద్రబాబు బయటకు రావడం కష్టమే అన్నట్లుగా ఆయన నర్మగర్భంగా ఇలాంటి ట్వీట్ చేశారంటూ విశ్లేషణలు వస్తున్నాయి.ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయన మంగళవారం వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే( Rajahmundry Central Jail ) గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాంతో ప్రభుత్వ పట్టుదలే గెలిచినట్లుగా భావించవచ్చు.మరి బాబును పట్టిన చంద్రగ్రహణం ఎప్పటికీ వీడుతుందో అని తెలుగు తమ్ముళ్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.