సంక్రాంతి అంటే కోడి పందేలు.కోడి పందేలు లేకపోతే అది పండుగే కాదు అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది గోదావరి జిల్లాలో.
అంతగా మమేకం అయ్యి ఉంటుంది గోదావరి జిల్లాల్లో.అటువంటిది ఆ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిదుల పరిస్థితి గురించి చెప్పుకుంటే.
పందేలకు సంబందించిన పర్మిషన్ కోసం ఇక్కడి నాయకులపై ఒత్తిడి ఆషామాషీగా ఉండదు.తాజాగా కోడి పందేల అంశంపై స్పందించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.
కోడి పందేలను సాంప్రదాయ పద్దతిలో నిర్వహించి తీరుతామంటూ ఆయన గట్టిగానే చెబుతున్నారు.కత్తి కట్టకుండా, బెట్టింగ్‌లకు తావులేకుండా కోడిపందాలను నిర్వహిస్తామంటూ ఆయన చెబుతున్నారు.
కోడి పందాలు ఆడడం అన్యాయం, అక్రమం అనుకునేవాళ్లు ప్రస్తుతం ఉన్న 150 రూపాయల పెనాలిటీని కోటి రూపాయలకు పెంచాలని,లేకపోతే దిశా చట్టం మాదిరిగా ఉరి శిక్ష వేయించుకోవడమో చేయాలని ఆయన ఎద్దేవా చేశారు.ఇక జగన్ మూడు రాజధానుల ప్రకటనపైనా ఆయన స్పందించారు.
అమరావతిలో ఉన్న కొన్ని ఆపీసులను మరో ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని పూర్తిగా అమరావతిని తరలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అంటూ రఘురామ కృష్ణంరాజు చెప్పారు.