బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం అక్కడ మంచి జోష్ మీద ఉంది.వరుస హిట్స్ తో తన క్రేజ్ ని అమాంతం పెంచుకొని ప్రస్తుతం నాలుగు, ఐదు ప్రాజెక్ట్ ల వరకు చేతిలో పెట్టుకొని తన హవా కొనసాగిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ భామ తెలుగులో పాన్ ఇండియా మూవీ, రాజమౌళీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో కనిపించబోతుంది.ఇక ఈ భామ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
ఇక ఈ సినిమా కోసం భారీ పారితోషికం తీసుకుంటున్న అలియా భట్ తన రెండో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తుంది.
అయితే అలియా చేస్తున్న రెండో సినిమా పెద్ద హీరోతో కాకుండా చిన్న హీరోతో అని చెప్పుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో వరుస హిట్స్ కొడుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే దిశగా దూసుకుపోతున్న అడవి శేష్ తో కలిసి ఈ అమ్మడు నటిస్తుందని సమాచారం.ప్రస్తుతం అడవి శేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ఈ సినిమా బాధ్యతలని మహేష్ భార్య నమ్రతా చూసుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అలియాని తీసుకుంటున్నట్లు సమాచారం బాలీవుడ్ లో తనకున్న పరిచయాలని ఉపయోగించుకొని నమ్రతా, అలియాతో మాట్లాడి ఈ సినిమాలో చేయడానికి ఒప్పించినట్లు టాక్ వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వేచి చూడాల్సిందే.