రాజధానిపై నివేదిక సిద్ధం: జగన్ ను కలవబోతున్న జీఎన్ రావు కమిటీ

రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది.గత టిడిపి ప్రభుత్వంలో రాజధానిపై అనేక కమిటీలు వేసినా ఏ కమిటీ నివేదికను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఫాలో అవ్వలేదు.

 Gn Rao Committe Ready To Submit Report On Ap Capital-TeluguStop.com

చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలోని రాజధాని నిర్మాణం చేపట్టారు.అయితే దీనిని అప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఇప్పుడు తాను అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణంపై అసలు నిజాలు తేల్చాలంటూ జీఎన్ రావు కమిటీని జగన్ నియమించారు.దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన జిఎస్ రావు కమిటీ ఈమేరకు నివేదికను ఈ రోజు జగన్ కు అందించేందుకు ఆయనతో భేటీ కాబోతున్నారు.

ఇప్పటికే ఏపీలో మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటనపై అనేక నిరసనలు, అనుకూల వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో ఈ కమిటీ నివేదిక ఏవిధంగా ఉండబోతోంది అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఈ కమిటీ రాజధానిపై ప్రజల అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేసింది.

జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నిపుణులు తదితరులతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించింది.అలాగే అందుబాటులో ఉన్న భూమి, మానవ వనరుల పైన ఈ కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది.

మొత్తం నివేదిక సిద్ధం అవడంతో జగన్ కు ఆ నివేదికను నేడు అందించబోతోంది.ఆ కమిటీ అధ్యయనం చేసిన వివరాలు ఏంటి అనే విషయం బయటకి వస్తే ఎన్నో రాజకీయ సంచలనం ఏపీలో తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube