10 జన్ పధ్ షర్మిల కు “అభయ హస్తం” ఇచ్చినట్టే

చాలాకాలంగా అందరూ అంచనా వేస్తున్న విధంగానే వైఎస్ షర్మిల( YS Sharmila ) రాజకీయం కార్యచరణ కదులుతున్నట్టుగా తెలుస్తుంది.వైయస్సార్ టి పి ( YSRTP ) విలీనం పై చాలా కాలంగా వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ వాస్తవరూపం దాల్చలేదు.

 Ys Sharmila Meets Sonia And Rahul Gandhi In New Delhi Details, Ys Sharmila ,soni-TeluguStop.com

అయితే నిన్న ఉదయం తన భర్త అనిల్ తో కలిసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమైన షర్మిల తన రాజకీయ భవిష్యత్తుపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది .కాంగ్రెస్లో వైఎస్ఆర్టిపి పార్టీ విలీనం, ఆ తదనంతర పరిణామాలు తన రాజకీయ భవిష్యత్తుకు భరోసా గురించే ప్రధానంగా ఈ చర్చ జరిగిందని వార్తలు వస్తున్నాయి.

Telugu Ap, Cm Kcr, Congress, Delhi, Rahul Gandhi, Sonia Gandhi, Ys Jagan, Ys Sha

తెలంగాణ రాజకీయాల్లో తనకున్న ఆసక్తిని వివరించి చెప్పిన షర్మిల తనకు తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగాలని ఉందనే తన కోరికను గాంధీ కుటుంబంతో చెప్పినట్లుగా తెలుస్తుంది.అయితే తెలంగాణలో కాంగ్రెస్( Congress Party ) అధికారంలోకి రావడానికి తన వంతు ప్రయత్నం చేయాలని అదికార పదవులు ,భవిష్యత్తుకు భరోసావంటి అంశాలను తాము చూసుకుంటామనే స్పష్టమైన హామీని షర్మిల కు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.ప్రధమ కర్తవ్యం గా తెలంగాణ వ్యవహారాలను చూసుకోవాలని తెలంగాణ ఎన్నికల ఫలితాలు తదనంతర పరిణామాలను బట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఆలోచించవచ్చని షర్మిలకు స్పష్టం చేసినట్లు సమాచారం.

Telugu Ap, Cm Kcr, Congress, Delhi, Rahul Gandhi, Sonia Gandhi, Ys Jagan, Ys Sha

సమావేశం అనంతరం బయటకు వచ్చిన షర్మిల కేసీఆర్ ను( KCR ) గద్దే దించాల్సిన సమయం ఆసన్నమైందని కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని , తాను మొదటి నుంచి చెప్పినట్టుగా తెలంగాణ ప్రజల సర్వతో ముఖాభివృద్ధి కోసం కృషి చేస్తుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ ఆమె ముగించారు.అయితే తెలంగాణలో ఎన్నికలలో పోటీ గురించి గానీ, పాలేరు అసెంబ్లీ సీటుపై స్పష్టత గాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన పాత్ర గురించి గానీ ఆమె వివరాలు ఏమి చెప్పలేదు .ఆఖరికి తన పార్టీ విలీనం గురించి కూడా ఏ విధమైన ప్రకటన చేయలేదు.అయితే మరి రెండు రోజుల్లో విలీనం తాలూకు ప్రక్రియపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చిన తర్వాతే ఆమె ప్రకటిస్తారని తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube