సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో తో అనుకున్న సినిమాలు ఇంకో హీరో తో చేయడం ఒక దర్శకుడు తో అనుకున్న సినిమా ఇంకో దర్శకుడితో చేయడం సర్వ సాధారణం.అయితే పెద్ద హీరోల సినిమాలే ఇక్కడ ఆగిపోతూన్నాయి.
ఇక చిన్న హీరోలా సినిమాలు అప్ కమింగ్ హీరో లా సినిమాలు ఆగిపోవడం పెద్ద కష్టం ఏమి కాదు.టాలీవుడ్ ఇండస్ట్రీ మెగా స్టార్ అయిన చిరంజీవి సినిమానే ఆగిపోయింది, అది కూడా రాంగోపాల్ వర్మ తో చేయాల్సిన ఒక సినిమా ఆగిపోయింది.
ఆ సినిమా కి అశ్వినిదత్ ప్రొడ్యూసర్ అలాగే చిరంజీవి, డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చిన భూలోక వీరుడు సినిమా కూడా ఆగిపోయింది.అలాగే చిరంజీవి ని హీరో గా పెట్టి హాలీవుడ్ రేంజ్ లో తీయాల్సిన అబూ బాగ్దాదు గజ దొంగ సినిమా కూడా అర్థాంతరం గా ఆగిపోయింది.
రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్ లో అంతకు ముందు బంగారం లాంటి మూవీ తీసిన డైరెక్టర్ ధరణి తో చేయాల్సిన మెరుపు సినిమా ఆగిపోయింది.అంతకు ముందే రామ్ చరణ్, కాజల్ కాంబో లో వచ్చిన మగధీర హిట్ అవ్వడం తో రామ్ చరణ్, కాజల్ తో మూవీ ప్లాన్ చేసారు.
కానీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత, రెలీజ్ అయినా ఆరంజ్ మూవీ ప్లాప్ కావడం తో అది ఓవర్ బడ్జెట్ వల్ల ప్లాప్ అయిందని ఈ మెరుపు మూవీ బడ్జెట్ తగ్గించమని డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ తో చిరంజీవి చెపితే డైరెక్టర్ ఒప్పుకోలేదు అందుకే ఆ మూవీ ఆగిపోయింది.
అలాగే బాల కృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించిన నర్తనశాల సౌందర్య మరణం తో మధ్యలో ఆగిపోయింది.అలాగే పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి వరసగా 7 హిట్స్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా తర్వాత తన దర్శకత్వం లోనే వచ్చిన జానీ ప్లాప్ అవ్వడం తో A.M రత్నం గారి బ్యానర్ లో మళ్ళీ తన దర్శకత్వం లోనే సత్యాగ్రహి అనే సినిమా స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేసారు.పవన్ కళ్యాణ్.పూరి జగన్నాధ్ లాంటి సంచలన దర్శకుడి మొదటి సినిమా కూడా ఆగిపోయింది.ఎవరితో అంటే పూరి తన ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ బద్రి కంటే ముందే సూపర్ స్టార్ కృష్ణ గారి తో ఒక సినిమా స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేసారు.
అలాగే వెంకటేష్ కూడా వంశీ డైరక్షన్ లో గాలిపురం రైల్వే స్టేషన్ అనే మూవీ స్టార్ట్ అయి మధ్యలోనే ఆగిపోయింది.అలాగే నేను శైలాజ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిషోర్ తిరుమల డైరెక్షన్ లో కూడా వెంకీ ఒక మూవీ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసాడు.ఉదయ్ కిరణ్ సినిమాలైతే చాలానే ఆగిపోయాయి.
వైవిధ్య కథలతో మెప్పించగల చంద్ర శేఖర్ యేలేటి గారి డైరెక్షన్ లో వచ్చిన ఐతే చిత్రం, అనుకోకుండా ఒక రోజు లాంటి మూవీస్ తీసి హిట్ కొట్టిన చంద్ర శేఖర్ గారు ఉదయ్ కిరణ్ తో ఒక మూవీ అనౌన్స్ చేసి మధ్యలో ఆపేసారు అలాగే ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి లాంటి హిట్స్ కొట్టిన పూరి కూడా ఉదయ్ కిరణ్ తో ఒక మూవీ స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేసాడు…ఇలా చాలా మంది హీరోలా మూవీస్ ఆగిపోయాయి.
ఇలా మూవీస్ ఆగిపోవడానికి మనం ఏ ఒక్కరిని తప్పు పట్టడానికి వీలులేదు ఎందుకంటే సినిమా అనేది బిజినెస్ .ఇండస్ట్రీ లో రోజు రోజు హీరోల లెక్కలు మారిపోతూ ఉంటాయి.అప్పుడున్న హీరో ఇమేజ్ ని బట్టి వారి పైన అంత బడ్జెట్ పెట్టచ్చా అని ఆలోచించవచ్చు లేదా ఆ డైరెక్టర్ ఇంత పెద్ద మూవీ ని హ్యాండిల్ చేయగలడా అని అనుకోని ఉండచ్చు.
ఒకవేళ మూవీ చేసిన బిజినెస్ అవుతుందా అని అన్ని ఆలోచించుకోవాల్సి ఉంటుంది.ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఎదో ఒక విషయం లో అయినా మూవీ ఆగిపోవచ్చు లేదంటే హీరో కి ప్రొడ్యూసర్స్ కి గొడవలు వచ్చి కూడా ఆగిపోవచ్చు.
ఒక పని జరగడానికి ఒక్క కారణం చాలు, ఒక పని ఆగిపోవడానికి 100 కారణాలు ఉండచ్చు.అది ఏమైనా ఇండస్ట్రీ బాగుంటే నే ఇండస్ట్రీ ని నమ్ముకొని బతికే చాల మంది జనాలు బతుకుతారు.
ఒక 4 సినిమాలు స్టార్ట్ అవుతేనే అందరు బాగుంటారు… ఇండస్ట్రీ ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి.అందుకని సినిమా షూటింగులు మూడు పువ్వులు ఆరు కాయలు గా నడుస్తూనే పేద కళాకారుడిది, కార్మికుడిది కడుపు నిండేది.