మీడియా ముందు కూర్చున్నా, అంతేసిమంది ఒకేసారి ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నా, ఇలియానా అస్సలు భయపడదు.పబ్లిక్ లో ఉన్నా, తనకు తోచిందే చేస్తుంది, తనకు అనిపించిందే చెబుతుంది.
అలాంటి ముక్కుసూటి మనిషి ఇల్లిబేబి.తన ముక్కుసూటి తత్వాన్ని మరోసారి బయటపెడుతూ, మరోసారి చురకలు అంటించింది ఇలియానా.
ఈ గోవా సుందరి బాయ్ ఫ్రెండ్ పేరు ఆండ్రూ నీబోన్.ఇతడు ఆస్ట్రేలియా జాతీయడు.
మంచి ఫోటోగ్రాఫర్.ఇతడి తెల్లతోలు మనిషి కాబట్టే ఇలియానా అతడిని వలలో వేసుకుందని ఇలియానా మీద ఎవరో కామెంట్ చేసారట.
దాంతో ఇలియానాకి చిర్రెత్తుకొచ్చింది.
ప్రతీసారి నా బాయ్ ఫ్రెండ్ మీద దృష్టిపెడతారు ఎందుకు? నా పర్సనల్ లైఫ్ మీదే ఎందుకు ఇంత అటెన్షన్.నా బాయ్ ఫ్రెండ్ జాతి గురించి ఎందుకు మీకు? తెల్లవాడు కాబట్టి డేటింగ్ చేసానా? మనిషి రంగుని చూసి ఎవరైనా ప్రేమలో పడతారా? అతడు మంచిమనిషి.నా మనసుకి నచ్చినవాడు.
ఇంకేదో కారణంతో ప్రేమలో పడలేదు.నేను పబ్లిక్ ఫిగర్ నే, కాని పబ్లిక్ ప్రాపర్టీని కాదు.
ప్రతిసారి నా వ్యక్తిగత జీవితం గురించే అడిగి విసిగించొద్దు.మీ అక్కచెల్లెళ్ళని ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా? వారి ఇష్టానికి ఇచ్చే గౌరవం నాకెందుకు ఇవ్వరు? అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది ఇలియానా.