నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ

చిత్రం : నేనే రాజు నేనే మంత్రి
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్ & బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం : తేజ
నిర్మాతలు : సురేష్ బాబు, భరత్ చౌదరీ & వి.కిరణ్ కుమార్ రెడ్డి
సంగీతం : అనూప్ రూబెన్స్
విడుదల తేది : ఆగష్టు 11, 2017
నటీనటులు : రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కాథరీన్, నవదీప్ తదితరులు

 Nene Raju Nene Mantri Review-TeluguStop.com

కథలోకి వెళితే :


జోగేంద్ర (రానా) ఓ పల్లెటూరిలో వడ్డీవ్యాపారం చేస్తూ ఉంటాడు.మంచి మనసు అతని సొంతం.మామూలు జీవితం గడుపుతున్న జోగేంద్రకి రాజకీయాల్లోకి వెళ్ళాలనే బలమైన కోరిక పుడుతుంది.దానికి కారణం ఊరి సర్పంచి చేతిలో తనకు జరిగిన అవమానం.రాధ (కాజల్) ని పెళ్ళి చేసుకోని రాధ జోగేంద్రగా మారిన కథానాయకుడు సియ్యం (తనికెళ్ళభరణి) క్యాబినెట్ లో మంత్రిగా తన రాజకీయ జీవితం మొదలుపెడతాడు.

కాని మంత్రి పదవి కాదు జోగేంద్రకి కావాల్సింది.చీఫ్ మినిస్టర్ పదవి అతడి లక్ష్యం.

మరి ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో జోగేంద్ర ఎన్ని ఎత్తులు వేసాడు, ఎన్ని కుయక్తులు పన్నాడు.అతడి రాజకీయ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు చూసింది తెర మీద చూడండి.

నటీనటుల నటన :


రానా దగ్గుబాటి ఈ సినిమాకి ఆయువుపట్టు.ఈమధ్యకాలంలో వచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ రానాది.

ఆ యాటిట్యూడ్, ఆ బాడి లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరి .అన్నిటికీ ఎక్కడ వాడాలో, ఎక్కడ పెంచాలో, ఎక్కడ తగ్గించాలో బాగా అర్థం చేసుకోని, కమర్షియల్ హంగులకి లోబడే, అర్థవంతమైన నటన కనబరిచాడు రానా.హీరో పెర్ఫార్మెన్స్ కే విజిల్స్ పడే సీన్లు ఉన్నాయి.ఇక లుక్స్ మీద చెప్పేదేముంది, రానా స్క్రీన్ ప్రేసేన్స్ అమ్మాయిల మతులు పోగొట్టడం ఖాయం.కాజల్ చాలా అందంగా ఉంది.చాలాకాలం తరువాత ఇలాంటి హోమ్లీ పాత్ర చేసింది కాజల్.

రానాతో తన కెమిస్ట్రీ అదుర్స్.కాథరీన్ బాగా చేసింది.బిగ్ బాస్ కత్తి మహేష్ సినిమాలో ఓ చిన్న హైలెట్ అవబోతున్నాడు.

టెక్నికల్ టీమ్ :


అనూప్ సంగీతం ఆల్బం వరకు ఫర్వాలేదు అనిపించింది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే.సినిమాటోగ్రాఫీ ఒకే.సురేష్ ప్రొడక్షన్స్ సినిమాల్లో ప్రొడక్షన్ వాల్యూస్ జనరల్ గా చిన్న స్టాండర్డ్ లో ఉంటాయి.ఇందులో మీడియం.

ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ని రోజంతా తిట్టుకుంటూ కూర్చోవచ్చు.డైలాగ్స్ విపరీతంగా అలరిస్తాయి.

విశ్లేషణ :


సినిమా కథ వెనుక ఉన్నది ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్.ఫస్టాఫ్ అంతా సెటప్ కాబట్టి రాధ – జోగేంద్రల ప్రేమ సన్నివేశాలు బాగుంటాయి.

కాని రాను రాను ఆ సీన్స్ డోస్ పెరిగిపోతూ ఉంటుంది.అక్కడినుంచి విసుగు కూడా పెరుగుతుంది.

అక్కడక్కడ అధ్బుతమైన సీన్స్ ఉంటాయి.కాని ఓ ఫ్లోలో ఉండవు.

చాలాసేపు నీరసం, కాసేపు ఊపు.ఇలా సాగుతుంది నేనే రాజు నేనే మంత్రి.విపరీతమైన హైప్ వచ్చింది ఈ సినిమాకి.బోయపాటి లాంటి బ్రాండ్, నితిన్ లాంటి మార్కెట్ ఉన్న హీరోల సినిమాలు బరిలో ఉన్నా, అడ్వాన్స్ బుకింగ్ లో రానా ముందుకు వెళ్ళాడు అంటే అది హైప్ వల్లే.

ఆ హైప్ ని అందుకోలేకపోయారు తేజ.శ్రద్ధ మొత్తం రానా క్యారక్టర్, కాజల్ మీదే తప్ప, కథనం ఎటు వెళుతుందో పట్టించుకోలేదు.అందుకే, బలమైన పాత్రలు, బలమైన కథవస్తువు ఉన్నా, బలహీనమైన కథనం వలన నేనే రాజు నేనే మంత్రి మెప్పించడం కష్టం.

ప్లస్ పాయింట్స్ :

* జోగేంద్ర పాత్ర

* డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

* ప్రేమ సన్నివేశాల ఓవర్ డోస్

* మంచి ఆరంభం తప్ప పట్టు తప్పే కథనం

* సెకండాఫ్

* తేజ టేకింగ్

రేటింగ్ : 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube