ఏడేళ్ళ వయసులో ఉన్న పిల్లలు మామూలుగానైతే ఏం చేస్తారు? ప్రైమరీ స్కూలులో చదువుతూ, టీచర్లు ఇచ్చిన హోమ్ వర్క్ పూర్తీ చేసేందుకు తంటాలు పడుతూ, దొరికిన కొద్ది సమయంలో కార్టూన్ చూస్తారు లేదంటే విడియో గేమ్స్ ఆడతారు.అంతే తప్ప ఆ వయసులో సామాజిక స్పృహ ఉండటం చాలా కష్టమైన విషయం.
కాని తమిళనాడులో కాంచిపూరం జిల్లా పడూర్ కి చెందిన ఏడేళ్ళ ఆకాష్ అందరిలాంటి పిల్లాడు కాదు.అంత చిన్న వయసులో సామాజిక విషయాల గురించి తనకి తెలిసిన రీతిలో ఆలోచించేవాడు.
విషయంలోకి వెళితే పడూర్ ప్రాంతంలో పేదరికం ఎక్కువ.వారి అదృష్టం ఏమిటంటే ఆ ప్రాంతంలో ఒక్క బెల్టు షాపు కూడా లేదు.
మద్యం బానిసలు లేకపోవడం వలన వారి జీవనం పేదరికంలో ఉన్నా మద్యం మత్తులో లేదు.కాని ఈ నెల 15వ తేదినా ఆ ప్రాంతంలో ఒక బెల్టు షాప్ ఓపెన్ చేసారు.
ఈ విషయం ఇష్టం లేని గ్రామస్తులు నిరసనలు వ్యక్తం చేసారు.అయినా స్పందన లేకపోవడంతో బెల్టు షాపుని ద్వంసం చేసారు.
దాంతో పోలీసులు 132 మంది మీద కేసు నమోదు చేసి 9 మందిని ఇప్పటికే అరెస్టు చేసారు.అందులో మహిళలు కూడా ఉన్నారు.
అక్కడితో వారి నిరసనలు ఆగలేదు.ఓ వ్యక్తీ బెల్టు షాపు తిరిగి తెరవకూడదు అంటూ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసాడు.
తన గ్రామస్తుల కష్టాల్ని గమనించిన చిన్నారి ఆకాష్ .స్వయంగా తనే రంగంలోకి దిగాడు.
గాంధిజీ చేతిలో కర్ర ఉన్నట్టు ఆకాష్ చేతిలో పుస్తకం, వెనకాల స్కూలు బ్యాగు ఉంది.నిర్భయంగా స్కూలు ఉనిఫాం వేసుకొని పోలీసు స్టేషన్ ముందు కూర్చున్నాడు.
చాలా సింపుల్ గా చేసినా, తన నిరసనలో బలం ఏంతో పోలీసులకి అర్థం అయ్యింది.తన దీక్షను విరమింపజేశారు.అక్కడినుంచి మన ఆకాష్ తనతో పాటు 13 మంది విధ్యార్థులని తీసుకొని జిల్లా కలెక్టర్ వద్దకు ఓ వినతి పత్రంతో బయలుదేరాడు.అసలు మద్యం దుకాణం ఎరుగని ప్రాంతంలో కొత్తగా బెల్టు షాప్ తీసుకొచ్చి, ప్రజలకి మద్యాన్ని అలవాటు చేసి, అసలే పేదరికంలో ఉన్నవారి కుటుంబాలని నాశనం చేయొద్దని ఆకాష్ వేడుకున్నాడు.
చిన్నారి పోరాటానికి చలించిపోయిన కలెక్టర్ పొన్నయ్య, పడూర్ ప్రాంతంలో కొత్తగా తీసుకొచ్చిన బెల్టు షాప్ ని శాశ్వతంగా మూసివేయాలని అధికారులకి ఆర్డర్లు జారీచేసారు.
ఈరకంగా మద్యం షాపు మూయించివేసి తన గ్రామ ప్రజల్ని మద్యం మత్తులో పడకుండా కాపాడుకున్న ఆకాష్ అక్కడితో తన పని పూర్తయిపోయిందని సరిపెట్టుకోవట్లేదు .తుమ్మ చెట్ల తొలగింపు, హెల్మెట్ వినియోగం మీద తన గ్రామ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాడు.ఏడేళ్ళ బాలుడి ఆలోచనలు ఎంత పెద్దగా ఉన్నాయి ? వయసుతో కాదు మనిషి జ్ఞానాన్ని, విచక్షణను సంపాదించేది, మంచి ఆలోచనతో అని చెప్పడానికి ఈ బాలుడు పెద్ద సాక్ష్యం.