2019లో బెస్ట్‌ యాప్స్‌ ఏవో మీకు తెలుసా?

2019 ఏడాదికిగాను బెస్ట్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌ ఏవో ప్రకటించాయి ఆపిల్‌, గూగుల్‌.ఆపిల్‌కు చెందిన యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌లలో యూజర్స్‌ వేసిన ఓట్ల ప్రకారం ఈ బెస్ట్‌ యాప్స్‌ను ఎంపిక చేశాయి.

 2019 Best Apps-TeluguStop.com

ఆపిల్‌ విషయానికి వస్తే స్పెక్టర్‌ (Spectre) ఐఫోన్‌ యాప్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచింది.

ఐఫోన్‌ యూజర్స్‌ లాంగ్‌ ఎక్స్‌పోజర్‌ ఉన్న ఫొటోలను తీసుకోవడానికి ఈ యాప్‌ను వాడతారు.

ఆపిల్‌ యాప్‌ స్టోర్‌లో దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.అయితే ఇది ఫ్రీ యాప్‌ కాదు.రూ.249 చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఆండ్రాయిడ్‌ విషయానికి వస్తే ఆబ్లో (Ablo) గూగుల్‌ ప్లే స్టోర్‌ యాప్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచింది.

ఆబ్లో ఒక చాట్‌ యాప్‌.

ఈ యాప్‌ ద్వారా ప్రపంచంలోని ఎక్కడి వాళ్లతో అయినా చాట్‌ చేసుకోవచ్చు.ఈ యాప్‌ ప్రత్యేకత ఏంటంటే.

ఇందులో మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ రియల్‌ టైమ్‌లో ట్రాన్స్‌లేట్‌ అవుతాయి.ఇక స్కై (sky) చిల్డ్రన్‌ ఆఫ్‌ ద లైట్‌ అనే గేమ్‌ ఐఫోన్‌ గేమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచింది.

టాప్‌ ఫ్రీ గేమ్స్‌ ప్రకారం.మారియో కార్ట్‌ టూర్‌ యాప్‌ స్టోర్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవడం విశేషం.

ఆండ్రాయిడ్‌ విషయానికి వస్తే కాల్‌ ఆఫ్‌ డ్యూటీ గూగుల్‌ ప్లే స్టోర్‌ గేమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచింది.ఆపిల్‌ యాప్‌ స్టోర్‌లో టాప్‌ యాప్స్‌ జాబితాలో యూట్యూబ్‌ తొలిస్థానంలో నిలవగా.

ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌, టిక్‌టాక్‌, మెసెంజర్‌, జీమెయిల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube