బిర్యానీ అంటే చెవులు కోసుకునే వారు చాలా మంది ఉన్నారు.ఇక చికెన్ బిర్యానీని జీవితంలో ఒక్కసారైనా రుచిచూడాల్సిందే అంటూ తిన్నవారు చెప్పే భగవద్గీత మనం చాలాసార్లు వినుంటాం.
కానీ వంద రూపాయలు పెట్టి చికెన్ బిర్యానీ తినాలంటే కాస్త ఆలోచిస్తాం.కానీ తమిళనాడులోని కోయంబత్తుర్ జనం మాత్రం చికెన్ బిర్యానీ సెంటర్ వద్ద బారులు తీరారు.
వారు అక్కడ ఎందుకు ఎగబడ్డారో తెలుసా?
కోయంబత్తురులో ఓ రెస్టారెంట్‌ను కొత్తగా ప్రారంభించారు.దీంతో సదరు రెస్టారెంట్ ఓపెనింగ్ రోజున చికెన్ బిర్యానీ రూ.15, ఎగ్ బిర్యానీ రూ.10, పరోటా రూ.5కే అంటూ ఆఫర్ ప్రకటించారు.ఇది చూసని జనం ఏమీ ఆలోచించకుండా బిర్యానీ కుమ్మేద్దామని ఆ హోటల్ ముందు క్యూ కట్టేశారు.
రెస్టారెంట్ ఓపెనింగ్ రోజున ఇంత భారీ సంఖ్యలో జనం వస్తారని సదరు హోటల్ యాజమాన్యం కూడా ఊహించలేదు.
వచ్చినవారందరికీ బిర్యానీ వడ్డించారు హోటల్ సిబ్బంది.అయితే తిన్న నాలుక ఊరికే ఉండదుగా.బిర్యానీ ఇంకాస్త బాగుండాల్సింది అంటూ ఓ వంక పెడుతూ వెళ్లారు కడుపునిండా మెక్కిన జనం.ఏదేమైనా తమ రెస్టారెంట్ ఓపెనింగ్ రోజున వినియోగదారులకు తక్కువ రేటుకే బిర్యానీ అందించి వార్తల్లో నిలిచింది ఈ రెస్టారెంట్.