ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్( Whatsapp ) ప్రపంచాన్ని రూల్ చేస్తోందని చెప్పుకోవచ్చు.ప్రపంచ వ్యాప్తంగా వున్న స్మార్ట్ ఫోన్ల యూజర్లలో దాదాపుగా 90 శాతం మంది వాట్సాప్ వాడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.
ఇక కొత్త స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరు మొదటగా ఇన్స్టాల్ చేసే యాప్ ఇదేనట.అవును, ఇపుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ వాట్సాప్‌ను వాడుతున్నారు.
కేవలం మెసేజ్‌లను పంపడమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాలతో పాటు స్టేటస్ పెట్టుకోవడం, గ్రూప్ చాట్స్ వంటి అనే ఫీచర్లు ఉండడంతో చాలామంది వాట్సాప్‌ను వాడుతున్నారు.

దాంతో వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఖుషి చేస్తోంది.ముఖ్యంగా యూజర్లకు మంచి ఎక్స్పీరియన్స్ అందించడానికి ఎప్పటకప్పుడు కొత్తకొత్త అప్డేట్స్ను అందిస్తుంది.దీంతో ఎక్కువమంది యూజర్లు వాట్సాప్ వైపు ఆకర్షితులవుతున్నారు.
తాజా వాట్సాప్ కొత్తగా 12 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.అయితే ఈ ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని తెలుస్తోంది.
త్వరలోనే ఈ ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నారు.

అవును, వాట్సాప్ యూజర్ల యూసేజ్ ఎక్స్పీరియన్స్ మెరుగుపర్చడానికి 12 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు రానుంది.అవి ఏవంటే వెరిఫికేషన్ స్టేటస్( Verification Status ), ఫుల్-విడ్త్ మెసేజింగ్ ఇంటర్ఫేస్, మ్యూట్ నోటిఫికేషన్ బటన్( Mute notification button ), నంబర్ ఆఫ్ ఫాలోవర్స్, హ్యాండిల్స్, షార్ట్‌కట్స్, ఛానెల్ డిస్క్రిప్షన్, రియల్ ఫాలోవర్స్ కౌంట్, మ్యూట్ నోటిఫికేషన్ టోగుల్, ప్రైవసీ, విజిబిలిటీ స్టేటస్, రిపోర్టింగ్ వంటి ఫీచర్ల వల్ల వినియోగదారులు వాట్సాప్‌ను మరింత సమర్థవంతంగా వాడే అవకాశం ఉంటుంది.ప్రస్తుత వాట్సాప్ అప్డేట్స్లో అడ్మిన్ రివ్యూ అనే కొత్త అప్డేట్ను అందిస్తుంది.
ఈ ఫీచర్ వల్ల గ్రూప్ అడ్మిన్లకు అధిక పవర్స్ రానున్నాయి.