Nandamuri Janakiram Son : హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నందమూరి హరికృష్ణ మనవడు.. దర్శకుడు ఎవరంటే?

నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Ramarao ) తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు ఎంట్రీ ఇచ్చి రానిస్తున్న విషయం తెలిసిందే.ఎవరికి వారు హీరోలుగా సత్తాను చాటుతున్నారు.

 Yvs Chowdary To Direct Nandamuri Janakiram Son-TeluguStop.com

ఇకపోతే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ( Mokshagna ) ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు.అయితే మోక్షజ్ఞ కంటే ముందే మరో నందమూరి వారసుడు హీరోగా పరిచయం కాబోతున్నాడట.

అతను ఎవరో కాదు.హరికృష్ణ మనవడు.

హరికృష్ణ( Harikrishna )కు ముగ్గురు కొడుకులు కాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా రాణిస్తున్నారు.పెద్ద కొడుకు జానకిరామ్ మాత్రం నిర్మాణానికే పరిమితమయ్యారు.2014 లో రోడ్డు ప్రమాదానికి గురై ఆయన కన్నుమూశారు.అయితే ఇప్పుడు జానకిరామ్ పెద్ద కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఆ బాధ్యతను దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి తీసుకున్నట్లు సమాచారం.

Telugu Grand Son, Janaki Ram, Nandamuri, Tollywood, Yvschowdary-Movie

నందమూరి కుటుంబంతో వై.వి.ఎస్.చౌదరికి( YVS Chowdary ) మంచి అనుబంధం ఉంది.ముఖ్యంగా హరికృష్ణతో మంచి బాండింగ్ ఉండేది.వీరి కలయికలో వచ్చిన సీతారామరాజు’, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి మంచి మంచి సినిమాలను తెరకెక్కించారు.ఆ మూవీస్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే వరుస పరాజయాలు పలకరించడంతో కొన్నేళ్లుగా వై.వి.ఎస్.చౌదరి మెగాఫోన్ పట్టలేదు.మరోవైపు హరికృష్ణ కూడా 2018 లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

అయితే హరికృష్ణ లేనప్పటికీ ఆయన మీద అభిమానంతో ఇప్పుడు జానకిరామ్ పెద్ద కొడుకుని( Janakiram Son ) హీరోగా పరిచయం చేసే బాధ్యత వై.వి.ఎస్.చౌదరి తీసుకున్నాడట.

Telugu Grand Son, Janaki Ram, Nandamuri, Tollywood, Yvschowdary-Movie

హరికృష్ణ మనవడు ఒక మంచి లవ్ స్టోరీతో ఎంట్రీ ఇస్తున్నట్లు వినికిడి.2006లో రామ్ పోతినేనిని హీరోగా పరిచయం చేస్తూ వై.వి.ఎస్ రూపొందించిన ప్రేమ కథా చిత్రం దేవదాసు( Devadas ) ఘన విజయం సాధించింది.చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న వై.వి.ఎస్ మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube