కమల్ హాసన్, మణిరత్నం( Kamal Haasan Maniratnam ) వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 36 ఏళ్ల తర్వాత ఒక సినిమా రాబోతోంది.ఈ ఇద్దరూ కూడా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే.
ఇక పోన్నియన్ సెల్వన్( Ponniyin Selvan 0 తో మణిరత్నం కూడా మంచి దూకుడు మీదున్నారు.వీరి కాంబినేషన్లో ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది.
ఈ అదిరిపోయే కాంబినేషన్ తో పాటు మరింత భారీ క్యాస్టింగ్ ఉంటే సినిమాకి ప్లస్ అవుతుంది అనుకున్నారో ఏమో కానీ మణిరత్నం పెద్ద హీరోలను లైన్ లో పెట్టి మల్టీ స్టారర్ సినిమాగా తీయాలనుకున్నారు.కానీ ఆయన అంచనాలు తలకిందులై ఒప్పుకున్న వారంతా కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు.
ఈ సినిమాకు తగ్ లైఫ్ అనే పేరు కూడా పెట్టారు.యాక్షన్ థ్రిల్లర్ గా( Action Thriller ) కథను కూడా సిద్ధం చేసుకున్నారు.

ఇంత భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించాలనుకున్న తగ్ లైఫ్ సినిమా( Thug Life Movie )కి అలాగే కమలహాసన్ కి ఎవరు ఊహించని విధంగా షాకుల మీద షాకులు వస్తున్నాయి.భారీ యాక్షన్ సినిమా మరియు పెద్ద హీరో కాబట్టి మిగతా నటులు కూడా పెద్ద వల్లాయితే బాగుంటుందనే ఈక్వేషన్స్ తో మణిరత్నం భారీ తారాగణం ప్లాన్ చేశారు.దాంతో దుల్కర్ సల్మాన్ జయం రవి( Dulquer Salmaan, Jayam Ravi ) కూడా ఈ సినిమా కోసం మొదట సంతకం చేశారు.అయితే సినిమా కోసం చాలా రోజులు టైం ఇవ్వాల్సి వస్తుందట అందుకని ఈ ఇద్దరు హీరోలు కూడా ప్రస్తుతం సినిమా నుంచి తప్పుకున్నారు.
దాదాపు రెండు మూడేళ్ల సమయం పాటు కేవలం మల్టీ స్టారర్ గా( Multi Starrer ) నటిస్తున్న సినిమా కోసమే ఇస్తే తాము నటించాల్సిన మెయిన్ లీడర్ సినిమాలు పక్కన పోతాయని రీజన్స్ తో ఈ ఇద్దరు హీరోలు సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది.

అయితే ఈ ఇద్దరు హీరోలు కూడా ప్రస్తుతం సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు రావడంతో పాటు మణిరత్నం కూడా ఆందోళన చెందుతున్నారట.ఎందుకంటే ఇంత పెద్ద సినిమాకి ఆ ఇద్దరు హీరోలని మించిన వారు దొరక్కపోతే అది ఖచ్చితంగా మైనస్ పాయింట్ అయ్యా అవకాశం ఉంది. భారీ క్యాస్టింగ్ తో పాటు భారీ లెక్కలు కూడా మిస్ అవుతాయి.
మరి ఈ ఇద్దరు హీరోల ప్లేస్ లో అంతకన్నా మంచి హీరోలను తీసుకొని రీప్లేస్ చేయగలిగితే తప్ప ఈ సినిమాను ఎవరూ కాపాడలేరు అని సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.







