అగ్ర రాజ్యంలో గన్ కల్చర్ కు యువకుడి బలి...!!

అగ్ర రాజ్యం అమెరికాలో తూటాలు పేలడం పెద్ద కొత్తేమి కాదు, ఆ తూటాల ధాటికి అమాయకపు ప్రజలు బలై పోవడం కూడా కొత్త కాదు, అందుకే కాబోలు అమెరికా అక్కడి గన్ కల్చర్ పై పెద్దగా దృష్టి సారించడంలేదని అంటున్నారు నిపుణులు. అధ్యక్షుడు బిడెన్ తన ఎన్నికల హామీలో అమెరికాలో గన్ కల్చర్ పై ఆంక్షలు విధిస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కానీ అన్ని దేశాలపై పలు రకాల కారణంగా ఆంక్షలు మాత్రం విధిస్తున్నారని నిపుణులు మండిపడుతున్నారు.

 Young Man Died To Gun Culture In America, Died , America, Gun Culture, Joe-TeluguStop.com

కొన్నేళ్లుగా అమెరికాలో గన్ కల్చర్ పై ఎంతో మంది, ఎన్నో స్వచ్చంద సంస్థలు నిరసనలు తెలుపుతున్నా ఇప్పటికీ ప్రభుత్వ చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి.అమెరికాలో విచ్చల విడిగా సంతలో కూరలు అమ్మినంత సులభంగా తుపాకులు అమ్మేస్తున్న కారణంగా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తుపాకులను సులభంగా కొనగలుగుతున్నారు.

దాంతో స్కూల్ టీచర్స్ కొట్టారని, మందలించారని, స్నేహితులు ఆట పట్టిస్తున్నారని కోపం తెచ్చుకున్న విద్యార్ధులు తుపాకులతో కాల్పులు జరిగిన సంఘటనలు అమెరికాలో కోకొల్లలు.

తాజాగా అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఓ స్కూల్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.

అయోవాలోని డౌన్ టౌన్ సమీపంలోని ఈస్ట్ హైస్కూల్ వద్దకు ఒక్క సారిగా వచ్చిన ఆగంతకుడు కాల్పులు జరిపినట్టుగా ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది.

ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి అక్కడి సిసి కెమెరాల ఆధారంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ సంఘటన జరిగిన సమయంలో పిల్లలను స్కూల్ లోపలకి పంపి తలుపులు వేసేసామని, పిల్లలు బయటకు వచ్చే సమయం కాదు కాబట్టి భారీ ప్రాణ నష్టం తప్పిందని స్కూల్ నిర్వాహకులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube