టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ కిడ్ గా ఉన్న నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె నటిగా గుర్తింపు పొందడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో మంచు లక్ష్మి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడిన ఈమె తాను కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.
తాను ఒక సీనియర్ నటుడు కుమార్తె తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎందుకుంటుందనీ అనుకున్నాను.కానీ తాను కూడా కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని అలాగే బాడీ షేమింగ్ ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.
అయితే కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి చోట ఉందని మంచు లక్ష్మి తెలిపారు.బ్యాంకింగ్, ఐటీరంగాలలో కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎంతోమంది ఎదుర్కొంటున్నారని ఈమె తెలిపారు.

మనం ఎలా ఉన్నా కూడా మన పై కొందరు బాడీ షేమింగ్ చేస్తుంటారు.ట్రోల్స్ చేస్తుంటారు అయితే మనం వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి.అసలే ఈ చిన్న జీవితంలో మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ మన కోరికలను నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి.ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక ఇలాంటి ట్రోలింగ్, క్యాస్టింగ్ కౌచ్ అనేవి మనకు ఇబ్బంది కలగకూడదు వాటి గురించి పట్టించుకోకుండా ముందుకు సాగాలని ఈ సందర్భంగా వెల్లడించారు.