నేటి కాలంలో ఆడపిల్లగా పుట్టిన వారు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బ్రతుకు బజారుపాలు చేయడానికి మానవ మృగాలు కాచుకు కూర్చున్నాయనే విషయాన్ని మరచిపోతున్నారు.సొంత అన్నతో బయటికి వెళ్లిన అనుమానంగా చూసే సమాజంలో కళ్లతోనే కామాన్ని తీర్చుకునే తోడేళ్లు అడుగడుగున తారసపడుతూనే ఉంటాయి.అందుకే సోషల్ మీడియా గానీ, పోలీసులు గానీ ఆడపిల్లలను అనుక్షణం అప్రమత్తం చేస్తూ ఒంటరిగా గానీ, బాయ్ ఫ్రెండ్‌తో గానీ ఎక్కడికి వెళ్లకండని హెచ్చరిస్తున్నాయి.అయినా ఉన్నత చదువులు చదివిన వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిండు జీవితాన్ని కామాంధుల కుక్కలకు అర్పిస్తున్నారు.
ఇలాంటి ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ వివరాలు చూస్తే.
జిల్లాలోని ఉప్పలగుప్తం మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి రెండు వారాల క్రితం అల్లవరంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో ఉన్న సముద్రంతీరానికి స్నేహితుడితో కలిసి వెళ్లిందట.అయితే అక్కడే మాటు వేసిన కామాంధులు మద్యం తాగిన మత్తులో యువకుడిపై దాడిచేసి, ఆ యువతి పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారట.
అంతే కాకుండా యువతి నగ్న ఫొటోలను చిత్రించి వెళ్లిపోయారట.
అయితే కొన్ని రోజుల తర్వాత ఆ కామాంధుల్లో ఒకడు బాధిత యువతికి ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని, లేదంటే ఆ నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో భయపడిన ఆ యువతి విషయాన్ని కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారట.
కాగా నిందితుల పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని పట్టుకునే పనిలో ఉన్నారట.