గోపీచంద్, రాజశేఖర్ మల్టీస్టారర్ మూవీ... ఆ దర్శకుడుతో

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీలకి హీరోలు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

చిన్న హీరోలు అందరూ స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు చేస్తున్నారు.

మరో వైపు సీనియర్ స్టార్ హీరోలు కూడా ఇంకో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.ఆచార్య మూవీ మెగాస్టార్, రామ్ చరణ్ కలయికలో మల్టీ స్టారర్ మూవీగానే తెరకెక్కుతుంది.

ఇక ఆర్ఆర్ఆర్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్లో అయ్యప్పన్ కోశియమ్ మూవీ రీమేక్ అవుతుంది.

అలాగే మెగాస్టార్ లూసీఫర్ లో కూడా మరో హీరోకి ఛాన్స్ ఉంది.అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో ఎఫ్ 3 మూవీ షురూ అయ్యింది.

Advertisement

ఇలా అరడజనుకి పైగా మల్టీ స్టారర్ చిత్రాలు తెరపై ఉండగా నాగార్జున కూడా మల్టీ స్టారర్ చిత్రాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.ఇదిలా ఉంటే సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలంగా మల్టీ స్టారర్ చిత్రాలతో పాటు విలన్ గా కూడా నటించడానికి రెడీగా ఉన్నాడు.

అతని ఇప్పటికే ధృవ్ సినిమాలో రాజశేఖర్ కి విలన్ గా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.అయితే ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలని రాజశేఖర్ లైన్ లో పెట్టాడు.

ఇప్పుడు మల్టీ స్టారర్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.యాక్షన్ హీరో గోపీచంద్ తో రాజశేఖర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

గోపీచంద్ కి లక్ష్యం, లౌక్యం సినిమాలతో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ చివరిగా సాక్ష్యం మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమాకి మంచి టాక్ వచ్చిన బడ్జెట్ పరిధులు కారణంగా కలెక్షన్స్ పెద్దగా రాలేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీని తర్వాత ఇంకో సినిమా చేయలేదు.ఇప్పుడు మళ్ళీ గోపీచంద్, రాజశేఖర్ కాంబినేషన్ లో ఒక సినిమాని సెట్ చేసుకున్నాడు.

Advertisement

భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ సినిమాని ఆవిష్కరించడానికి శ్రీవాస్ రెడీ అయ్యాడు.ఈ సినిమాతో ప్రముఖ వ్యాపారవేత్త నిర్మాతగా కెరియర్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ మూవీ చేస్తున్నాడు.

ఇది కంప్లీట్ అయ్యాక శ్రీవాస్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.ఈ లోపు రాజశేఖర్ కూడా తన రెండు సినిమాలని కంప్లీట్ చేస్తాడని తెలుస్తుంది.

తాజా వార్తలు