వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సీఎం జగన్ పాదయాత్ర సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను మరిచారని పురంధేశ్వరి విమర్శించారు.వర్షాలతో పత్తి రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వలేదన్నారు.
ఇకనైనా రైతుల ఇబ్బందులను క్షేత్రస్థాయిలో గుర్తించాలని తెలిపారు.ఉపాధి హామీ పనులు ఉపయోగకరంగా చేయించడం లేదని మండిపడ్డారు.
అంతేకాకుండా కేంద్రం అందిస్తున్న పథకాలను తాము అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందని ఆరోపించారు.