వావ్, అద్భుతం... పిజ్జా లాగా మారిన గురుగ్రహం.. నాసా షేర్ చేసిన వీడియోకి మిలియన్ల వ్యూస్..

అంతరిక్షాన్ని అన్వేషించాలనే కోరిక గల వారందరికీ నాసా ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఒక ఫేవరెట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు.నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) అనేది యూఎస్ ఫెడరల్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక స్వతంత్ర సంస్థ.

 Wow, Awesome Jupiter Turned Into Pizza Millions Of Views For Video Shared By N-TeluguStop.com

ఇది స్పేస్ కి సంబంధించి అనేక సరికొత్త విషయాలను ప్రపంచంలోని అందరితో షేర్ చేసుకుంటోంది.గ్రహాంతర ప్రదేశాల్లో చోటు చేసుకునే వండర్స్ ఎప్పటికప్పుడు మన కళ్ల ముందు ఉంచుతుంది.

వీటి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.తాజాగా ఇప్పుడు మరో అద్భుతమైన విషయాన్ని వీడియో రూపంలో తెలియజేసింది నాసా.

ఈ వీడియోకి ఇప్పటికే మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.లక్షల్లో లైకులు వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో గురు గ్రహం లేదా జుపిటర్ ఒక పెప్పరోని పిజ్జాగా మారినట్లు చూడొచ్చు.అయితే ఇది పిజ్జా టాపింగ్ గా కనిపించడానికి ముఖ్య కారణం దానిపై వెల్లువెత్తుతున్న పెప్పరోని తుఫానులేనని నాసా చెబుతోంది.

జూనో మిషన్ బృహస్పతి గ్రహంపై ఈ తుఫానులు గుర్తించినట్లు నాసా పేర్కొంది.ఇంటర్‌ ప్లానెటరీ పిజ్జా మీకు తెలుసా? మీరు ఇక్కడ చూస్తున్న దాని గురించి మరిన్ని స్పైసీ వివరాలు తెలియ జేస్తున్నాం అంటూ నాసా చాలా విషయాలను పంచుకుంది.

ఈ వీడియోలో కనిపిస్తున్నది బృహస్పతి గ్రహానికి సంబంధించిన ఉత్తర ధ్రువ పరారుణ దృశ్యం (infrared image) అని నాసా తెలిపింది.తమ నాసా సోలార్ సిస్టం మిషన్ జూనోలోని జోవియన్ ఇన్‌ఫ్రారెడ్ అరోరల్ మ్యాపర్ (JIRAM) డివైజ్ ద్వారా సేకరించిన డేటా వల్ల ఈ అద్భుతమైన వీడియో క్రియేట్ అయిందని నాసా వివరించింది.

“పిజ్జాలాగా కనిపించే వీటిలో పసుపు రంగు ప్రాంతాలు వెచ్చగా ఉంటాయి లేదా బృహస్పతి వాతావరణంలోకి లోతుగా ఉంటాయి.చీకటి ప్రాంతాలు చల్లగా ఉంటాయి లేదా బృహస్పతి వాతావరణంలో ఎత్తుగా ఉంటాయి.

ఈ క్లిప్‌లో అత్యధిక ప్రకాశ ఉష్ణోగ్రత దాదాపు 260K (సుమారు -13°C), అత్యల్పంగా 190K (సుమారు -83°C) ఉంటుంది.ఫిబ్రవరి 2, 2017న జూపిటర్ మీదుగా జూనో నాల్గవ ప్రయాణ సమయంలో ఈ చిత్రాలు సేకరించడం జరిగింది” అని నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో వెల్లడించింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Wow, Awesome Jupiter Turned Into Pizza Millions Of Views For Video Shared By NASA, Nasa, Viral Latest, Viral News, Social Media, Pizza - Telugu Nasa, Latest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube