యూపీఎస్సీ( UPSC ) పరీక్షలో సక్సెస్ ను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదు.సమయాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకుని లక్ష్యంపై దృష్టి పెడితే సక్సెస్ సొంతమవుతుందని ఐఏఎస్ రేణురాజ్ ప్రూవ్ చేశారు.
మొదట డాక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రేణురాజ్ ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనతో సివిల్స్ వైపు అడుగులు వేశారు.యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ గా సెలెక్ట్ అయిన రేణురాజ్ కేరళ( Kerala ) రాష్ట్రంలోని కొట్టాయంలో జన్మించారు.

తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి గృహిణిగా పని చేస్తున్నారు.వాళ్లు మొత్తం ముగ్గురు అక్కాచెల్లెళ్లు కాగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా డాక్టర్లుగా పని చేస్తున్నారు.డాక్టర్ కోర్స్ పూర్తైన తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టిన రేణు రాజ్ ( Renu Raj )ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పై దృష్టి పెట్టారు.సివిల్స్ లోకి వెళితే వేలమంది జీవితాలను మార్చవచ్చని ఆమె ఫీలయ్యారు.
రోజుకు 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆమె సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యారు.

ఏడు నెలల పాటు ప్రిపరేషన్ ను కొనసాగించానని మిగిలిన సమయాన్ని వైద్య వృత్తికి కేటాయించానని ఆమె అన్నారు.కొంతకాలం పాటు వైద్య వృత్తిని వదిలేసి ఐఏఎస్ కావాలని కష్టపడ్డానని ఆమె పేర్కొన్నారు.2022 సంవత్సరంలో రేణురాజ్ శ్రీరామ్ వెంకటరామన్ ( Sriram Venkataraman )ను పెళ్లి చేసుకున్నారు.నా భర్త కూడా ఐఏఎస్ అని అమె పేర్కొన్నారు.ఈమె వైవాహిక జీవితం కొద్దిగా వివాదాస్పదంగా మారింది.రెండు కష్టమైన వృత్తుల్లోకి వెళ్లి ఘనవిజయం సాధించిన రేణురాజ్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాలి.తొలి ప్రయత్నంలోనే రెండో ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
రేణురాజ్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.