యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం జపాన్ (Japan) వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.అయితే న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఈయన తిరిగి హైదరాబాద్ వచ్చేసారు.
అయితే హైదరాబాద్ రాగానే ఈయనకు జపాన్ గురించి అక్కడ వచ్చినటువంటి భూకంపం (Earthquakes) గురించి తెలియడంతో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే జపాన్లో భూకంపం రావడం గురించి ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చేస్తున్నటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.జపాన్ నుంచి ఈరోజు నేను ఇంటికి తిరిగి వచ్చాను అయితే అక్కడ భూకంపం వచ్చిందని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు.గత వారం రోజులపాటు నేను అక్కడే ఉన్నానని ఎన్టీఆర్ తెలిపారు.ఇలా జపాన్ లో భూకంపం( Japan Earthquake ) రావడం నిజంగా బాధ కలిగించే విషయమని అక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
ఈ కష్ట సమయంలో జపాన్ ప్రజల ధైర్యానికి కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఈయన కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో దేవర (Devara) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.అయితే న్యూ ఇయర్ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు.ఇక ఈయన తిరిగి వచ్చిన అనంతరం అక్కడ భూకంపం వచ్చిందనే విషయం తెలియడంతో ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇక వెకేషన్ పూర్తి చేసుకున్నటువంటి ఎన్టీఆర్ తిరిగి దేవర షూటింగ్లో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కాబోతుందని డైరెక్టర్ వెల్లడించారు ఇక మొదటి భాగం ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.