తెలుగుదేశం ,జనసేన పార్టీ ల మధ్య పొత్తు లో భాగంగా సీట్ల పంపకాలు జరిగాయి .అయితే జనసేనకు కేటాయించిన సీట్ల విషయంలో టిడిపి టికెట్ ఆశించిన నేతలు , టీడీపి కి టికెట్ కేటాయించిన సీట్ల లో జనసేన నాయకులు అసంతృప్తికి గురై, రచ్చ రచ్చ చేస్తున్నారు.
చాలా నియోజకవర్గాల విషయంలో ఈ తరహా వివాదాలు చోటుచేసుకున్నాయి.ఈ వ్యవహారం రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది.
అసంతృప్త నేతలను ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) పిలిచి బుజ్జగిస్తున్నారు.అయినా అటు టీడీపీ , ఇటు జనసేన నేతలు ఎవరూ తగ్గడం లేదు.
ఈ వ్యవహాం వైసీపీ కి కలిసి వస్తుందేమో అన్న టెన్షన్ కూడా రెండు పార్టీల అధినేతల్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈరోజు తాడేపల్లిగూడెంలో నిర్వహించే టీడీపీ జనసేన ఉమ్మడి సభతో ఈ విభేదాలు సమిసి పోతాయని , రెండు పార్టీల నేతలు అసంతృప్తిని వీడి ఉత్సాహంగా పనిచేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు.మొదటి నుంచి టిడిపితో పొత్తు ఉంటుందని పవన్ చెబుతూనే వస్తున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నామని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులను అర్థం చేసుకోవాలని పవన్( Pawan Kalyan ) పదేపదే చెబుతున్నారు.
టిడిపితో పొత్తుల భాగంగా తొలి జాబితాలో 24 సీట్లను టిడిపి, జనసేనకు కేటాయించింది.అయితే దీనిపైనే జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
కచ్చితంగా సీఎం పదవి షేరింగ్ ఇవ్వాలని కనీసం 50 స్థానాలైన జనసేన( Janasena )కు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.టికెట్లు ఆశించి , పార్టీ కోసం ఇప్పటి వరకు పనిచేసిన నేతలంతా తమకు అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తి గురై బహిరంగంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది స్వతంత్రంగా పోటీ చేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు .ఈరోజు తాడేపల్లిగూడెంలో నిర్వహించే రెండు పార్టీల సభలో అటు పవన్ ఇటు చంద్రబాబు ఈ వ్యవహారాలపై మాట్లాడుతారని , రెండు పార్టీల నేతల్లో అసంతృప్తిని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తారని ఈ సభ ద్వారా రెండు పార్టీలు మరింత కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని పవన్ చంద్రబాబు భావిస్తున్నారు.