మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం లో మిస్టర్ బచ్చన్( Mr.Bachchan ) అనే సినిమా వస్తుంది.అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇక తొందర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన తమ్ముడు అయిన రఘు కొడుకు మాధవ్( Madhav ) హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.ఇక ఈయన “మిస్టర్ ఇడియట్”( Mr.Idiot ) అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.మరి రవితేజ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ హీరో సక్సెస్ సాధిస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక సినిమా టైటిల్ లోనే ఇడియట్ సినిమా( Idiot Movie ) పేరు కలిసేలాగా మిస్టర్ అని పెట్టడం ఈ సినిమాకి చాలా వరకు కలిసి వస్తుంది అని చాలామంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఇక రవితేజ సోలోగా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ ఫుల్ హీరోగా నిలదొక్కుకున్నాడు.
ఇక రవితేజ లానే మాధవ్ కూడా ఇక్కడ చాలాకాలం పాటు కొనసాగుతాడా లేదా ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతాడా? అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.ఆయన ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి…చూడాలి మరి రవితేజ లాగా మాధవ్ కూడా స్టార్ హీరోగా మారుతాడా లేదా ఇక్కడ ఎదురయ్యే పోటీని తట్టుకోలేక వెనకడుగు వేస్తాడా అనేది… ప్రస్తుతం రవితేజ ఈ సినిమా యూనిట్ కి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు ప్రమోట్ చేస్తున్నాడు.ఇక సినిమా రిలీజ్ వరకు కూడా ఇదే సపోర్ట్ ని కొనసాగిస్తూ మాధవ్ కి ఒక సక్సెస్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
.