జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు పిఠాపురంలో ప్రచారం చేశారు.
మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయితేజ్ జనసేన మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది.మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తనవంతుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని పిఠాపురం ప్రజలు గెలిపించాలని వీడియో సందేశం ఇచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మద్దతు తెలిపారు.కాగా రామ్ చరణ్( Ram Charan ) ఎన్నికల ప్రచారం చివరి రోజు శనివారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు.రేపు ఉదయం 9:30 నిమిషాలకు రాజమండ్రి విమానాశ్రయానికి తల్లి సురేఖతో కలిసి చరణ్ చేరుకోనున్నారు.పిఠాపురంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు.
అక్కడ ప్రత్యేక పూజలు చేసినా అనంతరం ప్రచారం చేయనున్నారు.ప్రచారం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ని చరణ్ కలిసే అవకాశం ఉంది.
2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.ఈసారి పిఠాపురం నుండి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.దీంతో 2024 ఎన్నికలను పవన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది.
కాగా ఎన్నికల ప్రచారానికి చివరి రోజు రాంచరణ్ వస్తూ ఉండటంతో.పిఠాపురంలో జనసేన( Janasena ) క్యాడర్ ఫుల్ జోష్ లో ఉండటం జరిగింది.