వి , నిశ్శబ్దం సినిమాల్లో ఏది హిట్‌?

నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వి’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పర్చింది.

 Which Is The Best Movie In V And Nishabdham,anushka, Ott Trending Movie, Nani, V-TeluguStop.com

నాని నుండి ఇలాంటి ఒక సాదా సీదా మూవీ వస్తుంది అనుకోలేదు అంటూ అభిమానులు పెదవి విరిచారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఎక్కడ ఊసే లేదు.

వారం రోజుల్లోనే సినిమా చప్పున చల్లారింది.నాని ‘వి’ తర్వాత అనుష్క ‘నిశబ్దం’ సినిమా కూడా అమెజాన్‌లో విడుదల అయ్యింది.

ఈ రెండు సినిమాల్లో ఏది విజయం సాధిందింది అంటూ ఒక చర్చ జరుగుతుంది.రెండు సినిమాలకు కూడా ప్లాప్‌ టాక్‌ వచ్చినా కూడా రెండు సినిమాల్లో ఒక సినిమా ఏది బెస్ట్‌ అంటూ ప్రశ్నించిన సమయంలో ఖచ్చితంగా వి సినిమా బెస్ట్‌ అనే టాక్‌ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

కాని అమెజాన్‌ లెక్కల ప్రకారం ‘వి’ సినిమా కంటే నిశబ్దం సినిమా హిట్‌ అంటా.అంటే అమెజాన్‌ లో ఎక్కువ మంది చూసిన సినిమా మరియు ఎక్కువ సమయం చూడబద్ద సినిమాగా నిశబ్దం నిలిచింది.
అనుష్క కు నెగటివ్‌ టాక్‌ వస్తూనే సినిమాకు సంబంధించి నెగటివ్‌ కామెంట్స్‌ చేస్తూనే పాజిటివ్‌ గా రియాక్ట్‌ అవుతున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమా అవ్వడం వల్ల నిశబ్దంను ఒక్కసారి అయినా చూడాలని ప్రేక్షకులు భావించారు.

అందుకే ప్లాప్‌ టాక్‌ వచ్చినా కూడా ఒకసారి చూద్దాం ఏం అవుతుంది.ఇంట్లోనే కూర్చుని చూడటం వల్ల పోయేది ఏముంది అని భావించి నిశ్శబ్దం సినిమాను చూస్తున్నారు.

కాని వి సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు.వి సినిమా కంటే చాలా ఎక్కువ వ్యూస్ మరియు రన్‌ టైం ను నిశబ్దం కలిగి ఉంది.

కనుక ఖచ్చితంగా ఈ రెండు సినిమాల్లో విజేత ‘నిశబ్దం’ అనడంలో సందేహం లేదు.ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఇంకా కూడా ఓటీటీలో ట్రెండ్‌ నడుస్తూనే ఉంది.

తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా నిశబ్దం ఉంది కనుక ఆ కారణం వల్ల కూడా కాస్త ఎక్కువ రన్‌ టైంను ఈ సినిమా కలిగి ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube