విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల సమస్యలు తక్షణ పరిష్కరిస్తాం విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు గౌ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు.ఈ సందర్బంగా ప్రజాదర్బార్ లో అనేక మత్స్యకార అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గారిని సంప్రదించి న్యాయం చేయాలనీ కోరారు.
అందులో భాగంగా ప్రధానమైన సమస్య ప్రతీ సంవత్సరము సీజన్ మొదటి వాయిజ్ నుండి బోట్లు రొయ్యలు కొనుగోలు దారులైన EXPORTERS ఫిషింగ్ హార్భర్ లో 24 EMPORTERS రూమ్స్ ఉన్నందున, ఇంతకు ముందు EXPORTERS మేము తెచ్చిన రొయ్యలుకు గిట్టుబాటు ధర కల్పించే వారు.గత 3,4 సం॥లు నుండి మేము తెచ్చిన రొయ్యలకు గిట్టు బాటు ధరలు నియంత్రించక పోగా ! మరియు 24EXPORTERS రూమ్స్ లో కేవలము 5 , 6 గ్రూప్స్ మాత్రమే రొయ్యలు కొనుగోలు చేస్తున్నారు.
మిగిలిన 18 రూమ్స్ లో ఉన్నవారు ఎవ్వరూ మా రొయ్యలను కొనుగోలు చేయడము లేదని, ఈ విషయము గురించి గత 3 సం॥లు నుండి Enterprise అడుగుతూ ఉన్నాము కానీ నేటికీ సమస్య కు పరిష్కారం లభించలేదని, కావున తమరు మా యందు దయి ఉంచి EXPRTRES అసోసి యేషన్ మరియు NPEDA వారిని పిలిపించి మీటింగు ఏ ఏర్పాటు చేయవలసినదిగా కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అందజేశారు.వెంటనే తదుపరి చర్యలు చేపట్టాలని ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ గోవింద రావు గారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఫిషిరీస్ అసోసియేషన్ సభ్యులు కొండబాబు, వీరన్న, బాబ్జి, నర్సింగ్, పీసీ అప్పారావు, బాలాజీ, ప్రసాద్, పోలీస్, కుంజుమాన్, మూర్తి, విజయ్ మరియు వైస్సార్సీపీ నాయకులు 30వార్డ్ ప్రెసిడెంట్ దశమంతుల మాణిక్యాల రావు, గుజరాపు రవి, రామరాజు, కంటుముచ్చు సాగర్, తదితరులు హాజరయ్యారు.