ఇరిగేషన్ మంత్రిగా తనపై చాలా బాధ్యత ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు.
గత సీఎం కుర్చీ వేసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని మాట తప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.రైస్ మాఫియాను నియంత్రిస్తామన్న ఆయన ఇప్పటికే రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.