బిగ్ బాస్ హౌస్ లో ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నవారిలో విశ్వ ఒకరు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ఊహించని విధంగా విశ్వ 9వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
ఇలా హౌస్ నుంచి విశ్వ ఎలిమినేట్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లను ఎంతో చాకచక్యంగా ఆడుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్న విశ్వ ఎలిమినేట్ కావడంతో హౌస్ సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.
ఇలా 9వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన విశ్వ బిగ్ బాస్ వేదిక పై హౌస్ సభ్యుల గురించి మాట్లాడుతూ వారికి కొన్ని సలహాలు సూచనలు అందించారు.అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఎవరు ఉంటారు.
బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరు అనే విషయాన్ని కూడా విశ్వ వెల్లడించారు.ఈ క్రమంలోనే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ల గురించి విశ్వ మాట్లాడుతూ…
టాప్ ఫైవ్ లో సిరి ఉండాలని విశ్వ తెలియజేశారు.
ఇక సన్నీ గురించి మాట్లాడుతూ సన్నీ ఇలా డల్ గా ఉంటే ఏం బాగోలేదని తనలా ఉంటూ తన గేమ్ ఆడితే ఎంతో బాగుంటాడని తప్పకుండా సన్నీ టాప్ 4 లో ఉంటాడు అని చెప్పారు.

అదేవిధంగా గెలిస్తే ఒకవిధంగా ఓడిపోతే మరొక విధంగా షణ్ముఖ్ ఉంటాడని, షణ్ముఖ్ కి టాప్ ర్యాంక్ ఇచ్చారు.ఇక రవి గురించి మాట్లాడుతూ అందరూ రవిని గుంటనక్క అంటారు కానీ నిజానికి రవి ఎంతో మంచి వాడిని రవి 2 స్థానంలో ఉంటాడనే చెప్పుకొచ్చాడు.

ఇక బిగ్ బాస్ విన్నర్ గా శ్రీ రామచంద్ర ఉంటాడని,తాను కోల్పోయిన తమ్ముని శ్రీరామచంద్రలో చూసుకున్నానని కచ్చితంగా శ్రీరామచంద్ర విజేతగా నిలుస్తాడని ఈ సందర్భంగా విశ్వ తెలియజేశాడు.