వైరల్ వీడియో: కరోనా పేషెంట్ల ముందు అదిరిపోయే స్టెప్స్ వేస్తున్న డాక్టర్..!

గత ఎనిమిది నెలల నుండి కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా భయపెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.భారతదేశపు విషయానికి వస్తే… ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదైన దేశంగా రెండో స్థానాన్ని పొందింది.

 Dance, Doctor, Covid19, Coronavirus-TeluguStop.com

అయితే అదృష్టం కొద్దీ ఈ కరోనా వైరస్ నుంచి మన దేశంలో చాలామంది కోలుకున్న వారు ఉన్నారు.ఇలా కోలుకోవడానికి ఎన్ని మాత్రలు వేసుకున్నా చివరికి మనోధైర్యం ఉంటే చాలు ఎంతటి ప్రాబ్లం నుంచైనా మనం బయటపడవచ్చు.

లేకపోతే ఆసుపత్రులలో ఉన్న కరోనా పేషెంట్లలో ధైర్యం నింపేందుకు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలామంది కరోనా వైరస్ లో పేషంట్స్ కు సహకరిస్తున్నారు.ఈ నేపథ్యంలో భాగంగానే ప్రపంచంలోని చాలా మంది డాక్టర్లు కొన్నిసార్లు కరోనా పేషెంట్ ముందర వారిని ఆనంద పరిచేందుకు కొందరు జోక్స్ వేస్తుంటే.

మరికొందరు వారిని ఉత్సాహపరిచేందుకు డాన్సులు వేస్తున్నారు.

ఇలా కరోనా పేషెంట్స్ ముందర డాన్సులు వేయడం కూడా ఒక రకమైన థెరపీ అని అంటున్నారు కొందరు డాక్టర్లు.

ఇలా చేయడం ద్వారా పేషెంట్స్ లో ఉత్సాహాన్ని తీసుకురావటం ద్వారా వారి బాడీలో ఉన్న కారణాలను ఉత్తేజం చెందుతాయని డాక్టర్లు తెలుపుతున్నారు.ఇలా చేయడం ద్వారా వారు కరోనా ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని అనేక డాక్టర్లు తెలిపారు.

ఇకపోతే తాజాగా అస్సాం రాష్ట్రంలోని డాక్టర్ సేనాపతి కోవిడ్ డ్యూటీలో ఉండగా కరోనా పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు మైఖేల్ జాక్సన్ స్టెప్పులు వేస్తూ అబ్బురపరిచాడు.

అచ్చం ప్రొఫెషనల్ డాన్సర్ ఎలా చేస్తారో అదే రేంజ్ లో ఆయన డాన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

వృత్తిరీత్యా ఆయన వైద్యుడు అయిన కానీ ఎప్పుడో తన కాలేజీ రోజుల్లో వేసిన అనుభవాన్ని అంత తెచ్చుకొని ఇప్పుడు కరోనా పేషెంట్లు ముందర తన డాన్స్ ప్రతాపాన్ని చూపించి అబ్బురపరిచాడు.ఇందుకు సంబంధించి వీడియోను తన కొలీగ్ డాక్టర్ సయ్యద్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది.

దీనిపై నెటిజన్స్ వారి స్టైల్స్ లో కామెంట్స్ పెడుతున్నారు.అందులో ఒక నెటిజన్ ఒకవేళ తనకు గాని కరోనా వస్తే ఈ డాక్టర్ తన ముందు కూడా డాన్స్ వేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube