తన భార్య ఉపాసన గురించి రామ్ చరణ్ బయట పెట్టిన విషయాలు

చాల మంది హీరోలు తమతో నటించే హీరోయిన్స్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు.వారితోనే ప్రేమ, పెళ్లి అంటూ బంధాలు ఏర్పరచుకుంటారు.

 Unknown Facts About Upasana ,upasana, Ram Charan, Tollywood, Maga Family , Chira-TeluguStop.com

కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తన వృత్తి తో ఎలాంటి సంబంధం లేని ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఇక్కడే అందరికి పెద్ద షాక్ తగిలింది.

అసలు వీళ్లిద్దరికీ ఎలా ప్రేమ కుదిరింది అని చాల మంది అనుకున్నారు.అసలు విషయంలోకి వెళ్తే ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరు ఒక ఏడేళ్ల పాటు ఎంతో మంచి సేన్హితులు.

కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక పార్టీ లో కలిసిన తర్వాత వీరి మధ్య కూడా ప్రేమ చిగురించింది.నిశితార్థం చేసుకోవడానికి సరిగ్గా ఏడాది ముందు వరకు వారిలో ప్రేమ బీజాలు లేవట.

ఎందుకో తెలియదు కానీ ఆమె మంచితనం నచ్చి రామ్ చరణ్ ముందుగా పెళ్లి ప్రపోసల్ పెట్టాడట.వెంటనే ఉపాసన ఒప్పుకోవడం, ఇరు కుటుంబాలు కూడా సయోధ్యకు రావడం తో అంగరంగ వైభవంగా ఆంధ్ర ఇంటికి తెలంగాణ అమ్మాయి కోడలు అయ్యింది.

ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ రామ్ చరణ్ కి, ఉపాసన దొరకడం నిజంగా ఒక అదృష్టం.ఈ మాట అంటుంది మరెవరో కాదు మన రామ్ చరణే.

ఇండస్ట్రీ వాడిని కాబట్టి రోజుకొక రూమర్ పుట్టుకాస్తుంది.అందుకే తన భార్యకు తనని అనుమానించడానికి ఎలాంటి స్కోప్ ఇవ్వకుండా జాగ్రత్త పడతానని, ఇవన్నీ మా నాన్న దగ్గర చూసి నేర్చుకున్నాను అంటున్నాడు రామ్ చరణ్.

ఇక ఇద్దరు బిజీ గా ఉండే వారే కాబట్టి తరచుగా టూర్స్ కూడా వేస్తుంటారట.ఉపాసన ఎక్కువ అందరిని ప్రేమిస్తుంది అని, తన కన్నా తన కుటుంబానికి బాగా దగ్గరైంది అని చెప్తున్నాడు రామ్ చరణ్.

Telugu Chiranjeevi, Maga, Ram Charan, Surekha, Tollywood, Upasana-Latest News -

ఇక రామ్ చరణ్ కి తండ్రి తో కాసేపు మాట్లాడాలి అంటే భయం అని కానీ తన భార్య మాత్రం ఆయనతో గంటలు గంటలు సరదాగా కబుర్లు చెప్తూ మాట్లాడుతుందని చెప్పాడు.ఇక ఆమె తెలుగు సైతం ఒక కిచిడి అని అందుకే త్వరగా తెలుగు నేర్పించే పనిలో ఉన్నానని కూడా తెలిపాడు చరణ్.తన భార్య కుటుంబం ఎంతో పెద్దదని, వారికీ బంధాల విలువ బాగా తెలుసు కాబట్టి కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది అని కూడా రామ్ చరణ్ చెప్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube