రానున్న పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది.ఈ మేరకు తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచే విధంగా కసరత్తు మొదలు పెట్టింది.
బీజేపీ సరికొత్త వ్యూహంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు.పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.ముందుగా రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు.అక్కడ నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు నోవాటెల్ హోటల్ కు వెళ్లనున్న అమిత్ షా బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.