ఒక్కోసారి టెక్నాలజీ నానాటికీ అభివృద్ధి చెందుతోందని ఆనందపడాలో లేదంటే బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది.ఎందుకంటే, ఈ అప్డేటెడ్ టెక్నాలజీ వాడుకొని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.
స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో జనాలను కొందరు చాలా తేలికగా మభ్య పెట్టి దోచేసుకుంటున్నారు.దానికి అనుకూలంగా మారిపోతున్నాయి మనం నేడు వాడుతున్న కొన్ని రకాలైన యాప్స్.

అవును, Google Play స్టోర్‌లలో స్టోర్ అయినా యాప్స్ అన్నీ శ్రేయస్కరం కాదు.అందులో కొన్ని మాత్రమే మంచివి.అయితే స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతిఒక్కరికీ ఏ యాప్స్ మంచిదో, ఏయే యాప్స్ వలన ప్రమాదాలు చోటుచేసుకునే అవసరం వుందో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.కొన్ని యాప్స్ ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే హ్యాకర్లు ఫోన్‌ను క్యాప్చర్ చేసి, ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ సంస్థ థ్రెట్ ఫ్యాబ్రిక్ ఇటీవలి నివేదికలో షార్క్‌బాట్ అనే కొత్త బ్యాంకింగ్ ఫార్మాలిటీ అనేక దేశాల్లోని ఆండ్రాయిడ్ వినియోగదారులను మోసం చేసిందని వెల్లడించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ లో కొన్ని రకాల యాప్‌లు అస్సలు ఉంచుకోవద్దని జాగ్రత్తలు చెబుతున్నారు.తాజా సమాచారం ప్రకారం.5 యాప్‌లు మహా డేంజర్ అని తెలుస్తోంది.ఇక్కడ కింద పేర్కొన్న 5 యాప్‌లు ఇన్‌స్టాల్ చేస్తే హ్యాకర్ల ఆధీనంలోకి మీ స్మార్ట్ ఫోన్ వెళ్ళిపోయినట్లేమరి.ఈ స్కామ్ ద్వారా వినియోగదారుల ఖాతా నంబర్, లాగిన్ ఐడీ సమాచారం లభిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కింది యాప్‌లను వెంటనే డిలీట్ చేయండి!
1.
Manager Small Lite (మేనేజర్ స్మాల్ లైట్)
2.My Finances Tracker (మై ఫైనాన్స్ ట్రాకర్)
3.Zetter Authentiction (జెట్టర్ అథెంటికేషన్)
4.Codice Fiscale 2022 (కోడైస్ ఫిస్కేల్ 2022)
5.Recover Audio (రికవర్ ఆడియో)
6.Image and Videos (ఇమేజ్ – వీడియోలు)