తెలంగాణలో ఐఏఎస్( IAS officers ) అధికారుల బదిలీలు జరిగాయి.ఈ మేరకు పదకొండు మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్( Arvind Kumar ) బదిలీ అయ్యారు.
ఈ మేరకు ఆయన విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేయబడ్డారు.
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశం, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్., ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజు(K S Sreenivasa Raju ) బదిలీ అయ్యారు.
అదేవిధంగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిశోర్ బదిలీ అయ్యారు.జీఎడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టి.కె.శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్.వి.కర్ణన్ బదిలీ అయ్యారు.