తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇలాంటి క్రమంలోనే తనదైన రీతిలో సినిమాలను చేస్తూ సక్సెస్ లు అందుకుంటూ ఉంటారు.
ఇక అలాంటి హీరోల్లో నాని( Nani ) ఒకరు…ప్రస్తుతానికి నాని హాయ్ నాన్న( Hi Nanna ) అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
అయినప్పటికీ తనకంటూ ఒక గొప్ప హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు కారణం ఆయన ఎంచుకున్న కథల్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఆయన ఎంచుకోవడమే ఒక చిన్న కథ ను ఎంచుకొని కొంతమంది ప్రేక్షకుల ఆదరణ పొందితే చాలు అన్నట్లు గా చూస్తున్నాడు దానివల్ల కంప్లీట్ అందరూ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు రావడం లేదు.
అందువల్ల ఆయన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు.
ఇక ఆయన భారీ సక్సెస్ కొట్టాలంటే తను ఎంచుకున్న సబ్జెక్టు కూడా బాగుండాలి.అలాగే కథ లో దమ్ము ఉండాలి ఆ కథ కి రేంజ్ పెద్దగా ఉండాలి… అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తు ఉండాలి అలాంటప్పుడు ఆ కథ అందరిని ఆకట్టుకుంటుంది.నిన్న కాక మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి హీరో కూడా ఈ రోజు స్టార్ హీరో రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
కానీ నాని మాత్రం ఇక్కడ ఇలాగే ఉండిపోతు సినిమాలు చేసిన కూడా మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోతున్నాడు.
ఇక ఇప్పటికి ఈ సంవత్సరం రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న నాని ఆయన తదుపరి చిత్రాలతో కూడా సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.అయితే విజయ్ తో పోలిస్తే మాత్రం నాను చాలా వెనకబడి ఉన్నాడు అనే చెప్పాలి…ఇక నాని సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా చేసిన విజయ్ ఇప్పుడు నాని నే సైడ్ చేశాడు అంటే ఆయన టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేము…