ఇదివరకు రిజిస్ట్రేషన్ కార్డ్ లేదా ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్‌గా ఉండేది.ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ దీనిని చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు ఆ తలనొప్పులన్నీ తొలగిపోయాయి.ఆన్‌లైన్‌లోనే ఈ RC ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం అందిస్తోంది.
ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కావాల్సిందల్లా, మీరు కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవడమే.మరి ఈ ప్రాసెస్ ఎలా ఫినిష్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి
– ఆర్‌సీని ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడానికి, అధికారిక వెబ్‌సైట్ parivahan.gov.inను విజిట్ చేయాలి.
– అకౌంట్ క్రియేట్ చేసి మీ వ్యక్తిగత వివరాలను అందించాల్సి ఉంటుంది.ఆర్‌సీ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌కి రూ.525 రుసుము పే చేయాల్సి ఉంటుంది.
– ఆపై ఫారమ్‌ను ఫిల్ చేసి డౌన్‌లోడ్ చేయాలి.ఫారమ్‌ను ఫిల్ చేసేటప్పుడు మీ సెలెక్టెడ్ RTOకి సబ్మిట్ చేయాలి.
– అప్లికేషన్ పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంచుకోవాలి.
– RC ట్రాన్స్‌ఫర్ కోసం అప్లై చేసేటప్పుడు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ (విక్రేత, కొనుగోలుదారు), ఛాసిస్, ఇంజిన్ పెన్సిల్ ప్రింట్, కొనుగోలుదారు పుట్టిన తేదీ రుజువు, చిరునామా రుజువు, ఆర్.సి.పుస్తకం, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ట్యాక్స్ పే క్లియరెన్స్ సర్టిఫికేట్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీతో తీసుకెళ్లాలి.ఈ డాక్యుమెంట్లను స్కాన్ చేసి.
వాటిని మీ ఫోన్ గ్యాలరీలో ఉంచితే.మీరు దరఖాస్తు ఈ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది.