కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గ వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.ఈ మేరకు మంత్రి పినిపే విశ్వరూప్, కుమారుడు శ్రీకాంత్ మధ్య టికెట్ వార్ నడుస్తోంది.
అమలాపురం నుంచి తానే పోటీ చేస్తానని మంత్రి విశ్వరూప్ ప్రకటించారు.అయితే ఇప్పటికే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా తానే బరిలోకి దిగుతానని మంత్రి విశ్వరూప్ ప్రకటించడంతో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి.మరోవైపు విశ్వరూప్ ను కాదని శ్రీకాంత్ కు టికెట్ ఇస్తే సహకరించబోమని వైసీపీ సీనియర్లు చెబుతున్నారని తెలుస్తోంది.