కూతురి పుట్టినరోజున తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. కూతురి గురించి అలా చెబుతూ?

తెలుగు ప్రేక్షకులకు నందమూరి దివంగత హీరో తారకరత్న ( Hero Tarakaratna )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల ఆయన మరణించిన విషయం కూడా తెలిసిందే.

 Nandamuri Tarakaratna Daughter Nishka Birthday Post Goes Viral , Nandamuri Tarak-TeluguStop.com

తారకరత్న మరణాన్ని ఇప్పటికీ నందమూరి అభిమానులు( Nandamuri fans ) ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు మొదలుతూనే ఉన్నాయి.

రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తొలి అడుగు వేయగా ఆ తొలి అడుగు ఆయన జీవితానికి ఆఖరి అడుగుగా మారింది.ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే.

అయితే తారకరత్నకు అలేఖ్యరెడ్డితో ( Alekhya Reddy )పెళ్లి కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.ఇవాళ తారకరత్న పెద్ద కూతురు నిష్క( Nishka ) బర్త్‌ డే కావడంలో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నిముషం నుంచి మాకెంతో గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది.నీ నువ్వు, ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ కూతురికి బర్త్‌ డే విషెస్ తెలిపారు.

మీ ప్రతి అడుగులో మిమ్మల్ని ప్రేమించడానికి, మద్దతు ఇవ్వడానికి మీ మమ్ము ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది అంటూ ఎమోషనల్ గా రాసుకు వచ్చింది అలేఖ్య.

తన కూతురికి విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నిష్కతో పాటు తారకరత్న, అలేఖ్య రెడ్డికి కవల పిల్లలు తాన్యారామ్, రేయాలు కూడా ఉన్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవడంతో నందమూరి అభిమానులు నెటిజన్స్ అలేఖ్యకు ధైర్యం చెబుతూనే నిష్క కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ దీవిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube