ప్రస్తుత సమ్మర్ లో రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.ఉదయం 10 గంటల నుంచి భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు.

 This Smoothie Helps To Keep You Powered Up In Summer! Summer, Smoothie, Healthy-TeluguStop.com

ప్రస్తుత సమ్మర్ సీజన్ లో రోజంతా ఎనర్జిటిక్ గా ఉండడం అనేది దాదాపు అందరికీ ఎంతో కష్టతరంగా మారుతుంది.అధిక వేడి, ఉక్కపోత, చెమటలు ఒంట్లో శక్తిని మొత్తాన్ని ఆవిరి చేసేస్తాయి.

దీంతో నీరస పడిపోతుంటారు.మధ్యాహ్నానికే కొందరికి ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతుంటాయి.

ఏ పని చేయలేకపోతుంటారు.అందుకే ఈ సమ్మర్ లో శరీరానికి డబుల్ ఎనర్జీని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ( Breakfast )లో ఈ స్మూతీని కనుక తీసుకుంటే మీరు వేసవిలో రోజంతా ఎనర్జిటిక్ గా ఉండడం గ్యారంటీ.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్ ( Rolled oats )వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.

అలాగే మరొక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ) మరియు వాటర్ పోసి నానబెట్టుకోవాలి.అరగంట తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్ ను వేసుకోవాలి.

Telugu Energy Smoothie, Tips, Oatsapple, Smoothie, Smoothiehelps-Telugu Health

అలాగే రెండు టేబుల్ స్పూన్లు నాన‌బెట్టుకున్న చియా సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax seeds ), ప‌ది నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పు, ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు ఒక కప్పు యాపిల్ ముక్కలు వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.తద్వారా మన టేస్టీ అంటే హెల్తీ ఓట్స్ యాపిల్ స్మూతీ అనేది సిద్ధం అవుతుంది.

Telugu Energy Smoothie, Tips, Oatsapple, Smoothie, Smoothiehelps-Telugu Health

రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని కనుక తీసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉండడానికి అవసరమయ్యే ఎనర్జీ మీ బాడీకి అందుతుంది.ఈ స్మూతీ నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేలా ప్రోత్సహిస్తుంది.

అలాగే ఈ స్మూతీ అతి ఆకలిని అణచివేస్తుంది.అధిక బరువు నుంచి బయటపడేందుకు సహాయపడుతుంది.

మరియు ఎముకల దృఢత్వానికి, కండరాల నిర్మాణానికి సైతం ఈ స్మూతీ ఉత్తమంగా తోడ్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube