కోతులు, కుక్కల మధ్య స్నేహం రేర్‌గా ఉంటుంది.ఇవి రెండు జంతువులు ఒక దానిని మరొకటి చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాయి.
అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇవి కలిసి ఉంటాయని చెప్పొచ్చు.ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ అవుతోంది.
సదరు వైరల్ వీడియోలో కోతి, కుక్క కలిసి ఓ పని చేశాయి.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.హ్యాపీగా కోతి, కుక్క కలిసి ముందుకు సాగుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
వీడియో వివరాల్లోకెళితే.కోతి, కుక్క మధ్య అరుదైన స్నేహం ఆవిష్కృతమైంది.
ఈ క్రమంలోనే రెండూ కలిసి దొంగతనం చేశాయండోయ్.అవునండీ.మీరు చదివింది నిజమే.దొంగతనం చేయాలనుకున్న కోతికి డాగ్ హెల్ప్ చేసి, తన స్నేహ శీలతను చాటుకుంది.వైరల్ వీడియోలో డాగ్ మీద మంకీ కూర్చొని ఉంటుంది.ఇవి రెండూ కలిసి చిప్స్ ప్యాకెట్స్‌ను దొంగతనం చేసేందుకు ప్లాన్ చేశాయి.
అందులో భాగంగానే కుక్క షాపు దగ్గర నిలబడి ఉండగా.దానిపైన ఉన్న మంకీ.
చిప్స్ దొంగిలించేందుకు ట్రై చేస్తుంది.
అలా చిప్స్ ప్యాకెట్ చింపేందుకుగాను ట్రై చేస్తూ కిందికి దూకుతుంది.మళ్లీ చిప్స్ ప్యాకెట్ చింపేదుకుగాను కుక్క పైకి ఎక్కుతుంది మంకీ.ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ను అక్కడున్న వారు వీడియో రికార్డు చేశారు.
అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ అవుతోంది.అలా అరుదైన స్నేహానికి ప్రతీకగా కుక్క, కోతి నిలిచాయి.
ఇక ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇవి రెండు ప్రాణులు సాధారణంగా శత్రువులుగా ఉంటాయని, అటువంటిది ఇక్కడ కలిసి ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు.