వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర.. బంగ్లా పై ఘన విజయం..!!

వరల్డ్ కప్ టోర్నీ( World Cup 2023 )లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది.ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లపై విజయం సాధించిన టీమిండియా( India ) గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఘన విజయం సాధించింది.

 Victory Of Team India Against Bangladesh World Cup2023, India Vs Bangladesh, Vi-TeluguStop.com

పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్( Bangladesh ) మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయడం జరిగింది.

బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్ 51, లిట్టన్ దాస్ 66 పరుగులు చేసి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారు.కానీ తర్వాత భారత బౌలర్లు( Indian Bowlers ) సమిష్టిగా రాణించడంతో.

వెంట వెంటనే వికెట్లు పడ్డాయి.

బంగ్లాదేశ్ 50 ఓవర్లకు ఎనిమిది టికెట్లు నష్టానికి 256 పరుగులు చేసింది.అనంతరం 257 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ దిగగా 41.3 ఓవర్లలో కేవలం 3 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. విరాట్ కోహ్లీ (103*).సూపర్ సెంచరీ చేయగా గిల్ 53, రోహిత్ 48, రాహుల్( Rahul ) 34 రన్స్ తో రాణించారు.విరాట్ కోహ్లీ 97 బంతుల్లో ఈ సెంచరీ సాధించడం జరిగింది.ఇందులో నాలుగు సిక్స్ లు, ఆరు ఫోర్ లు ఉన్నాయి.

దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్( International Cricket ) లో అత్యంత వేగంగా 26,000 పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.ఈ ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతూ ఉండటంతో క్రికెట్ ప్రేమికులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube