వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర.. బంగ్లా పై ఘన విజయం..!!
TeluguStop.com
వరల్డ్ కప్ టోర్నీ( World Cup 2023 )లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లపై విజయం సాధించిన టీమిండియా( India ) గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఘన విజయం సాధించింది.
పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్( Bangladesh ) మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయడం జరిగింది.
బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్ 51, లిట్టన్ దాస్ 66 పరుగులు చేసి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారు.
కానీ తర్వాత భారత బౌలర్లు( Indian Bowlers ) సమిష్టిగా రాణించడంతో.వెంట వెంటనే వికెట్లు పడ్డాయి.
"""/"/
బంగ్లాదేశ్ 50 ఓవర్లకు ఎనిమిది టికెట్లు నష్టానికి 256 పరుగులు చేసింది.
అనంతరం 257 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ దిగగా 41.3 ఓవర్లలో కేవలం 3 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.
విరాట్ కోహ్లీ (103*).సూపర్ సెంచరీ చేయగా గిల్ 53, రోహిత్ 48, రాహుల్( Rahul ) 34 రన్స్ తో రాణించారు.
విరాట్ కోహ్లీ 97 బంతుల్లో ఈ సెంచరీ సాధించడం జరిగింది.ఇందులో నాలుగు సిక్స్ లు, ఆరు ఫోర్ లు ఉన్నాయి.
దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్( International Cricket ) లో అత్యంత వేగంగా 26,000 పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.
ఈ ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతూ ఉండటంతో క్రికెట్ ప్రేమికులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
విజయ్ దేవరకొండతో ప్రేమ విషయాన్ని బయటపెట్టిన రష్మిక…. ఇంస్టా పోస్ట్ వైరల్!