విశాఖలోని జగదాంబ ఇండస్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఆపరేషన్ థియేటర్ చెలరేగిన మంటలు ఆస్పత్రి అంతటా వ్యాపించాయి.
సమాచారం అందుకున్న నగర సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం సీపీ మాట్లాడుతూ మంటలను అదుపు చేశామన్నారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్న ఆయన మంటల్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.ఈ క్రమంలో గాయపడిన వారిని కేజీహెచ్ కు తరలించామని వెల్లడించారు.
అయితే ఆపరేషన్ థియేటర్ లో నైట్రస్ ఆక్సైడ్ కారణంగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది.