Samantha yashoda movie : యశోద కోసం సమంత ఈ రేంజ్ లో కష్టపడిందా? మేకింగ్ వీడియో వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా తాజా చిత్రం యశోద.హరి,హరీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, శ్రీదేవి మూవీస్ పతాకంపై శివ లెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

 Yashoda Movie Action Scene Making Video Goes Viral Yashoda Movie, Samantha, Toll-TeluguStop.com

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలకపాత్రలో నటించింది.ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల కారుంది.తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

కాగా ఈ సినిమాలో సమంత డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో చేశారు.

తాజాగా ఈ సినిమా లోని యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.

ఆ వీడియోల్ప్ సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి యానిక్ బెన్ మాట్లాడారు.యశోద సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పనిచేసిన వారిలో యానిక్ బెన్ కూడా ఒకరు కూడా ఒకరు.

ఆ వీడియోలో యానిక్ బెన్ మాట్లాడుతూ.నేను ఎప్పుడు నటుడిగా సేఫ్‌ గా ఉండేలా చూసుకుంటాను.

వాళ్ళకు యాక్షన్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్‌ గా తెలియాలని,ముందుగా స్టంట్ పెర్ఫార్మర్ లతో ఫైట్ కంపొజిషన్ చూపిస్తాం.నటీనటులకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకు టైమింగ్ తెలుస్తుంది.

ఆ తర్వాత ఫైట్ తీస్తాం.

సమంత చాలా డెడికేటెడ్‌గా షూటింగ్ చేస్తారు.ప్రతిసారి కూడా ఆమె తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.ఆమెతో షూటింగ్ చేయడం బాగుంటుంది.

యాక్షన్ ఎప్పుడూ రియల్‌గా ఉండటం నాకు ఇష్టం.యశోద సినిమాలో స్టంట్స్ కూడా రియల్‌గా ఉంటాయి.

రియల్ లైఫ్‌లో ఎలా జరుగుతుందో,యశోదలో యాక్షన్ కూడా అలాగే రియలిస్టిక్‌గా ఉంటుంది అని తెలిపాడు యానిక్ బెన్.కిక్ బాక్సింగ్, జూడో , మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ యశోద యాక్షన్ సీన్స్‌ లో ఉంటాయి అని చెప్పు కొచ్చారు యానిక్ బెన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube